సీఎం వైయస్‌ జగన్‌ను కలిసిన ఆర్యవైశ్య కార్పొరేషన్‌ చైర్మన్‌

అసెంబ్లీ:  ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని ఆర్యవైశ్య కార్పొరేషన్‌ చైర్మన్‌ కుప్పం ప్రసాద్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. అసెంబ్లీలోని సీఎం ఛాంబర్‌లో సీఎంను కలిసిన కుప్పం ప్రసాద్‌ తనకు చైర్మన్‌ పదవి ఇవ్వడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ఆయన వెంట మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్‌, బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి తదితరులు ఉన్నారు. అంతకు ముందు వైయస్‌ఆర్‌ విద్యుత్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ డైరీని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అవిష్కరించారు.  
 

తాజా వీడియోలు

Back to Top