సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు క్ష‌త్రియ సేవా స‌మితి కృత‌జ్ఞ‌త‌లు

తాడేప‌ల్లి: ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి క్ష‌త్రియ సేవా స‌మితి ప్ర‌తినిధులు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ను క్షత్రియ సేవా సమితి ప్రెసిడెంట్, జనరల్‌ సెక్రటరీ, సభ్యులు మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా.. అల్లూరి సీతారామరాజు పేరుతో నూతన జిల్లాను ఏర్పాటు చేసినందుకు సీఎం వైయ‌స్‌ జగన్‌ను సన్మానించారు. అదేవిధంగా క్షత్రియ సామాజికవర్గ సంక్షేమానికి క్షత్రియ కార్పొరేషన్‌ ఏర్పాటుచేసి నిధులు విడుదల చేయడంపై ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఈ నిధుల వల్ల తమ సామాజిక వర్గంలోని పేదలకు మరింతగా ప్రయోజనం చేకూరుతుందని ముఖ్యమంత్రికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. అంతేకాకుండా అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించడాన్ని స్వాగతిస్తూ క్షత్రియ సేవా సమితి ప్రతినిధులు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు. 

ఈ కార్యక్రమంలో  ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ముదునూరి ప్రసాదరాజు, క్షత్రియ కార్పొరేషన్‌ చైర్మన్‌ పాతపాటి సర్రాజు, క్షత్రియ సేవా సమితి ప్రెసిడెంట్‌ పేరిచర్ల నాగరాజు, జనరల్‌ సెక్రటరీ నడింపల్లి నాని రాజు, ఉపాధ్యక్షులు డాక్టర్‌ రఘురామరాజు, వి.వెంకటేశ్వర రాజు, అఖిల భారత క్షత్రియ ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శి రమేష్‌ దాట్ల, భీమవరం క్షత్రియ పరిషత్‌ సభ్యులు గాదిరాజు సుబ్బరాజు, దక్షిణ భారత క్షత్రియ సంఘం సభ్యులు మంతెన సోమరాజు ఉన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top