టీడీపీ కూట‌మి కీల‌క నేత‌లు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌

వైయ‌స్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో పార్టీలో చేరిన టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ, కాంగ్రెస్‌ నాయ‌కులు

గుంటూరు జిల్లా:  తెలుగు దేశం పార్టీ కూట‌మికి చెందిన కీల‌క నేత‌లు ఇవాళ సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి స‌మ‌క్షంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలుగుదేశం,జనసేన, భారతీయ జనతాపార్టీ, కాంగ్రెస్‌ పార్టీల నుంచి ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ సమక్షంలో వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన కీలక నేతలు. 

గుంటూరు జిల్లా నంబూరు బైపాస్‌ నైట్‌ స్టే పాయింట్‌ వద్ద గుంటూరు పశ్చిమ, గుంటూరు తూర్పు,  ప్రత్తిపాడు, మంగళిగిరి నియోజకవర్గాల్లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన, కాంగ్రెస్‌ నుంచి వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన వారికి కండువాలు వేసి వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి.

మంగళగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నుంచి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన మార్కెటింగ్‌ కమిటీ మాజీ చైర్మన్‌ ఎస్‌ రఘుపతిరావు, జిల్లా ఆర్గనైజింగ్‌ సెక్రటరీ టి సురేంద్ర కుమార్,కాపుసంఘం యువజన విభాగం అధ్యక్షుడు పెండ్యాల వెంకటరమణ కార్యక్రమంలో పాల్గొన్న వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు లోక్‌సభ అభ్యర్ధి కిలారి వెంకట రోశయ్య, మంగళగిరి అసెంబ్లీ అభ్యర్ధి మురుగుడు లావణ్య.

గుంటూరు పశ్చిమ నియోజవర్గం నుంచి వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన జనసేన రాష్ట్ర కన్వీనర్‌ వీరశెట్టి సుబ్బారావు.

భారతీయజనతాపార్టీ నుంచి వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీలోకి చేరిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చందు సాంబశివరావు, బీజేపీ స్టేట్‌ కో కన్వీనర్‌ డాక్టర్‌ టీ వీ రావు.

తెలుగుదేశం పార్టీ నుంచి వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన గుంటూరు టీడీపీ జిల్లా కన్వీనర్‌ బైరా అజయ్‌బాబు, గుంటూరు జిల్లా టీడీపీ కార్మిక సంఘం అధ్యక్షుడు నాగగౌడ్, మైనార్టీ నేత షేక్‌ షాజిత్‌.

కాంగ్రెస్‌ పార్టీ నుంచి వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన గుంటూరు నగర కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు షేక్‌ ఉస్మాన్‌.

ప్రత్తిపాడు నియోజకవర్గం జనసేన పార్టీ నుంచి వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన డాక్టర్‌ కె శివకుమార్, కె నాగరాజు, కందుల రాజా, భరత్, సునీల్‌ రెడ్డి, మంగిరెడ్డి. కార్యక్రమంలో పాల్గొన్న ప్రత్తిపాడు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి బలసాని కిరణ్ కుమార్‌

గుంటూరు తూర్పు నియోజకవర్గం (జనసేన పార్టీ 2019 అభ్యర్ధి) నుంచి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ముస్లిం ఐక్యవేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు షేక్‌ జియావుర్‌ రెహ్మాన్.

Back to Top