హరీష్‌ రావు.. ఏపీకి రా ఏం జరుగుతుందో చూపిస్తాం

 మంత్రి కారుమూరి నాగేశ్వ‌ర‌రావు

అమరావతి: హరీష్‌ రావు.. ఏపీకి రా మా రాష్ట్రంలో ఏం జరుగుతుందో చూపిస్తామ‌ని మంత్రి కారుమూరి నాగేశ్వ‌ర‌రావు స‌వాలు విసిరారు. తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్‌ రావుపై ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వర రావు సీరియస్‌ అయ్యారు. హరీష్‌ రావు.. దౌర్భగ్యమైన మాటలు మాట్లాడకు అంటూ చురకలు అంటించారు. ధనిక రాష్ట్రాన్ని(తెలంగాణ) మీ చేతిలో పెడితే ఏం చేశారో తెలియదా? అంటూ వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వ‌ద్ద‌ మంత్రి కారుమూరి నాగేశ్వ‌ర‌రావు మాట్లాడుతూ..  హైదరాబాద్‌లో వర్షం వస్తే ఇళ్ల మీద నుంచి నీళ్లు వెళ్తున్నాయి. హరీష్‌.. మీ రాష్ట్రంలో స్కూళ్లు, మా రాష్ట్రంలో స్కూళ్ల తేడా చూసుకో. తెలంగానలో సంక్షేమ పథకాలు.. మా సంక్షేమ పథకాలకు తేడా చూడు. జీడీపీలో మేం దేశంలోనే నంబర్‌ వన్‌లో ఉన్నాం. హరీష్‌ రావు.. ముందు మీ రాష్ట్రం సంగతి చూసుకో. ధనిక రాష్ట్రాన్ని మీ చేతిలో పెడితే ఏం చేశారో తెలియదా? అంటూ విమర్శలు చేశారు.  ఏపీలో జరుగుతున్న అభివృద్ధి గురించి తెలుసుకొని మాట్లాడాలి అని హితవు పలికారు. 
 

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top