శ్రీ‌శైల క్షేత్రానికి క‌ర్ణాట‌క సీఎం బ‌స‌వ రాజ్ బొమ్మై

క‌ర్ణాట‌క సీఎం, మాజీ సీఎంల‌కు ఘ‌న  స్వాగ‌తం

నంద్యాల‌: కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి  బసవ రాజ్ బొమ్మై, మాజీ సీఎం యడ్యూరప్ప శుక్ర‌వారం శ్రీ‌శైల క్షేత్రాన్ని సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా వారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి , నంద్యాల పార్లమెంటు సభ్యులు పోచ బ్రహ్మానంద రెడ్డి, శ్రీశైలం నియోజకవర్గ శాసనసభ్యులు శిల్పా చక్రపాణి రెడ్డి ,  నంద్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలాని సమూన్ స్వాగ‌తం ప‌లికారు. కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై,  మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప శ్రీ‌శైలంలో నిర్వ‌హిస్తున్న రాష్ట్రీయ ధర్మ జాగృతి మహాసమ్మేళన కార్యక్రమానికి హాజరై ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో శ్రీశైల జగద్గురు పీఠాధిపతి డాక్ట‌ర్ చెన్నసిద్ధరామశివాచార్య మహాస్వామి, ఉజ్జయని పీఠాధిపతి, కాశీ పీఠాధిపతులు, ప్రభుసారంగదేవస్వామీజీ,  కర్ణాటక క్యాబినెట్ మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. 

Back to Top