కార్యకర్తలు ఎవ్వరూ అధైర్యపడొద్దు

వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కుడు కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి 
 

నెల్లూరు:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కష్టపడిన కార్యకర్తలకు రుణపడి ఉంటాం..  ప్రజాసేవలో మమేకం అవుతాం.. ఎప్పటి లాగే ప్రజల్లో ఉంటాం.. కార్యకర్తలు ఎవ్వరూ అధైర్యపడొద్దు అని వైయ‌స్ఆర్ సీపీ నేత కాకాణి గోవర్థన్‌రెడ్డి అన్నారు. ప్రజలు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని కాకాణి గోవర్థన్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. దేశంలో ఎక్కడలేని విధంగా వైఎస్‌ జగన్‌ అనేక సంస్కరణలు చేపట్టారన్నారు. రాజీపడకుండా విద్యా, వైద్య రంగంలో ఎన్నో సంస్కరణలు చేశారని.. ప్రజలకు సంక్షేమం అందించడంలో.. అభివృద్ధి కార్యక్రమాల్లో ఎక్కడా రాజీ పడలేదన్నారు.

 పేదవానికి అండగా నిలిచాం.. పథకాలు అందుకున్న ప్రజలు ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలను అన్వేషిస్తాం.. వైస్సార్‌సీసీ అభ్యర్థుల గెలుపు కోసం కష్టపడిన కార్యకర్తలకు రుణపడి ఉంటాం..  ప్రజాసేవలో మమేకం అవుతాం.. ఎప్పటి లాగే ప్రజల్లో ఉంటాం.. కార్యకర్తలు ఎవ్వరూ అధైర్యపడొద్దు అని కాకాణి గోవర్థన్‌రెడ్డి అన్నారు.

వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వానికి అండగా ఉంటాం.. ఆయన విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం. ప్రజలకు అవసరమైన సంక్షేమ పథకాలను పార్టీలతో, కుల మతాలతో సంబంధం లేకుండా అందించామ‌ని కాకాణి చెప్పారు.

Back to Top