కడప ఎమ్మెల్యే కక్ష సాధింపు..!

వైయ‌స్ఆర్‌సీపీ నేత‌ల వాట‌ర్‌ప్లాంట్ల‌పై ప‌గ‌

అన్నీ అనుమ‌తులు ఉన్నా వాటర్‌ప్లాంట్‌ సీజ్‌

వైయ‌స్ఆర్‌ జిల్లా: కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి క‌క్షసాధింపు చ‌ర్య‌ల‌కు తెర లేపారు. ప్రజలేమైపోయినా పర్లేదని వైయ‌స్ఆర్‌సీపీ నేతల మీద ప‌గ పెంచుకొని న‌గ‌రంలో వాటర్‌ప్లాంట్‌లను మూసేయిస్తున్నారు. మొన్న కడప 26వ డివిజన్‌ కార్పొరేటర్‌ త్యాగరాజు వాటర్‌ప్లాంట్‌ కూలదోసేందుకు వెళ్లిన ఎమ్మెల్యే భంగపడ్డారు. తాజాగా వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఆదిత్య వాటర్‌ప్లాంట్‌ సీజ్‌ చేయించారు. అన్ని అనుమతులున్నా ప్లాంట్‌ను పాఠశాల భవనం అంటూ సాకు చూపి అధికారులతో సీజ్‌ చేయించారు. 

ఎంపీ నిధుల‌తో నిర్మించార‌నే అక్క‌సు:
కడప ఎంపీ వైయ‌స్‌ అవినాష్‌రెడ్డి నిధులతో వాటర్‌ప్లాంట్లు నిర్మించారనే అక్కసుతోనే ఎమ్మెల్యే ఈ దుశ్చర్యలకు పాల్పడ్డారు. అంతకుముందు 26వ డివిజన్‌ వాటర్‌ప్లాంట్‌ విషయంలో అన్నీ అనుమతులుండటంతో ఎమ్మెల్యే కూల్చివేతకు ఆదేశించినప్పటికీ అధికారులు, పోలీసులు వెనక్కి తగ్గారు. ఎమ్మెల్యేగా ఉండి వేసవిలో ప్రజల దాహర్తిని తీర్చాలి కానీ..ఇలా వాటర్‌ప్లాంట్లపై పగబట్టడం మాధవిరెడ్డికే చెల్లిందంటూ వైయ‌స్ఆర్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైయ‌స్ఆర్‌సీపీ నేత ఆదిత్య వాటర్‌ప్లాంట్‌ సీజ్‌పై చట్టప్రకారం కోర్టులను ఆశ్రయిస్తామని పార్టీ నాయకులు చెబుతున్నారు.

Back to Top