అభివృద్ధిపై ప్రశ్నిస్తే అణచివేస్తారా? 

వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కుడి అక్ర‌మ అరెస్టుపై మాజీ మంత్రి ఆగ్ర‌హం

మైలవరం పీఎస్‌ ముందు ధర్నా 

ఎన్టీఆర్‌ జిల్లా:  కూట‌మి ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ప్ర‌శ్నిస్తే అణ‌చివేస్తారా అంటూ మాజీ మంత్రి జోగి ర‌మేష్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లాలో టీడీపీ నేతల కక్ష సాధింపు చర్యల‌పై ఆయ‌న మండిప‌డ్డారు. అభివృద్ధిపై ప్రశ్నించినందుకు మైలవరం నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ మున్సిపాలిటీ విభాగం అధ్యక్షుడు కోమటి కోటేశ్వరరావును పోలీసులు అక్రమంగా అరెస్ట్‌ చేశారు. టీడీపీ నాయకుల ఫిర్యాదుతో కోటేశ్వరరావును అరెస్ట్ చేసిన పోలీసులు.. మైలవరం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వైయ‌స్ఆర్‌సీపీ నేత అక్రమ అరెస్ట్‌పై మాజీ మంత్రి జోగి రమేష్ ధ్వ‌జ‌మెత్తారు. ఆయనతో పాటు, వైయ‌స్ఆర్‌సీపీకార్యకర్తలు.. మైలవరం పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్నారు. అక్రమంగా అరెస్ట్ చేసిన కోటేశ్వరరావును వెంటనే విడుదల చేయాలంటూ జోగి రమేష్ డిమాండ్‌ చేశారు. ఆయన్ని మైలవరం సీఐ కార్యాలయం ఎదుట పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పీఎస్‌ ఎదుట వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు ధర్నాకు దిగాయి.

Back to Top