సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన జెన్నిఫ‌ర్ లార్స‌న్‌

తాడేప‌ల్లి:   ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని కాన్సుల్‌ జనరల్, యూఎస్‌ కాన్సులేట్ (హైదరాబాద్‌) జెన్నిఫ‌ర్ లార్స‌న్ మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. యూఎస్‌ కాన్సుల్‌ జనరల్‌గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన జెన్నిఫర్ బుధ‌వారం తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిశారు. ఏపీలో అమెరికన్‌ కార్నర్‌ పనితీరు బావుంది, కొత్త రాష్ట్రమైనా ఆర్దిక ఇబ్బందులు ఉన్నా కోవిడ్‌ మేనేజ్‌మెంట్‌ బాగా చేశారని జెన్నిఫర్ ముఖ్యమంత్రిని అభినందించారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తుందని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పేర్కొన్నారు. పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్‌ మంచి వేదికగా ఉపయోగించుకోవాలని కాన్సుల్‌ జనరల్‌ని కోరిన ముఖ్యమంత్రి, ప్రభుత్వం తరపున ఎటువంటి సహకారం అందించడానికైనా సిద్ధంగా ఉన్నామ‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ హామీ ఇచ్చారు. జీడీపీ గ్రోత్‌ రేట్‌ లో నెంబర్‌ వన్‌ గా ఉండడాన్ని అభినందించిన జెన్నిఫర్‌. 
ఈ సమావేశంలో యూఎస్‌ కాన్సులేట్‌కు చెందిన పలువురు ఉన్నతాధికారులు, సీఎం స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ డాక్టర్‌ కేఎస్‌. జవహర్‌ రెడ్డి, సీఎం స్పెషల్‌ సెక్రటరీ డాక్టర్‌ ఎం. హరికృష్ణ పాల్గొన్నారు.

Back to Top