వైయ‌స్ఆర్ సీపీలో చేరిన జ‌న‌సేన నేత ప్ర‌సాద్‌

జ‌గ్గంపేట‌: జ‌న‌సేన పార్టీ నేత రాయ‌పురెడ్డి ప్ర‌సాద్ (చిన్నా) వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జ‌గ్గంపేట మండ‌లం ఇర్రిపాకలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జగన్‌మోహ‌న్‌రెడ్డి చేతుల మీదుగా రాయ‌పురెడ్డి ప్ర‌సాద్ వైయ‌స్ఆర్ సీపీ కండువా క‌ప్పుకున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గ జనసేన అభ్యర్థిగా ప్రసాద్ పోటీచేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ, సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, వైయ‌స్‌ఆర్‌సీపీ యువజన నేత జక్కంపూడి గణేష్ ఉన్నారు.

Back to Top