వైయ‌స్ఆర్ సీపీలో చేరిన జ‌నసేన నేత వెంక‌ట ర‌మ‌ణ‌

తాడేప‌ల్లి: ఏలూరు జిల్లా ఉంగుటూరుకు చెందిన జ‌నసేన పార్టీ నేత న‌వుడు వెంక‌ట ర‌మ‌ణ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో నవుడు వెంకటరమణ వైయ‌స్ఆర్ సీపీలో చేరారు. ఈ మేర‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ వెంక‌ట ర‌మ‌ణ‌కు వైయ‌స్ఆర్ సీపీ కండువా క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 

Back to Top