అది ఫేక్ పాదయాత్ర కాదా?

అంబ‌టి రాంబాబు ట్వీట్‌
 

తాడేప‌ల్లి:  ఆధార్ కార్డు అడిగితేనే పారిపోతే..అది ఫేక్ పాదయాత్ర కాదా? అని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అమరావతి పేరిట చేపట్టిన పాదయాత్రకు డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో బ్రేకులు పడ్డాయి. హైకోర్టు ఆదేశాల మేరకు యాత్రలో పాల్గొన్న వారు.. గుర్తింపు కార్డులు ధరించి యాత్ర చేసుకోవాలని పోలీసులు సూచించారు. అయితే గుర్తింపు కార్డులు చూపించని నేపథ్యంలో యాత్ర నిలిచిపోయింది. ఈ యాత్ర‌పై మంత్రి అంబ‌టి రాంబాబు ట్వీట్ చేశారు. 

పాదదయాత్రకు విరామం తాత్కాలికం కాదు..శాశ్వత విరామమని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అమరావతి పాదయాత్ర ఫేక్‌ పాదయాత్ర అని అభివర్ణించారు. అది ఒళ్లు బలిసిన వాళ్ల పాదయాత్ర అని ఎద్దేవా చేశారు. టెంపుల్‌కు వెళ్లాల్సిన యాత్ర నియోజకవర్గాల నుంచి ఎందుకు వెళ్తుందన్నారు. యాత్రలో రైతుల కంటే నాయకులే ఎక్కువగా ఉండ‌టంతో మధ్యలోనే ఆగిపోయింద‌ని మంత్రి అంబ‌టి రాంబాబు పేర్కొన్నారు.

Back to Top