కనకదుర్గ ఫ్లైఓవర్‌ ప్రారంభం

వ‌ర్చువ‌ల్ కార్య‌క్ర‌మం ద్వారా ప్రారంభించిన కేంద్ర‌మంత్రి గడ్కరీ, సీఎం వైయ‌స్ జ‌గ‌న్ 

తాడేపల్లి: విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్‌ ప్రారంభమైంది. వర్చువల్‌ ద్వారా జరిగిన కార్యక్రమంలో రూ.502 కోట్లతో ఆరు వరుసలతో 2.6 కిలోమీటర్లు నిర్మించిన కనకదుర్గ ఫ్లైఓవర్‌ను కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ఫ్లైఓవర్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా, ఇప్పటికే రూ.8,007 కోట్లతో పూర్తయిన 10 ప్రాజెక్టులను జాతికి అంకిత ఇచ్చిన అనంతరం రూ.7584 కోట్ల విలువైన 16 ప్రాజెక్టులకు కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ, సీఎం వైయస్‌ జగన్‌లు భూమిపూజ చేశారు. మొత్తం రూ.15,592 కోట్లతో ప‌లు అభివృద్ధి పనులకు భూమిపూజ, ప్రారంభోత్సవాలు చేశారు.
 

Back to Top