రాజ‌మండ్రిలో ట్రాక్ట‌ర్లు పంపిణీ చేసిన హోం మంత్రి తానేటి వ‌నిత‌

రాజ‌మ‌హేంద్ర‌వ‌రం:    వైయ‌స్ఆర్ యంత్ర‌సేవా ప‌థ‌కాన్ని రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో మంగ‌ళ‌వారం రాష్ట్ర హోం మంత్రి తానేటి వ‌నిత‌ ప్రారంభించారు.  లబ్ధిదారులకు యంత్రాలను పంపిణీ చేశారు. రైతన్నలకు పెట్టుబడి ఖర్చు తగ్గించి,మరింత మెరుగైన ఆదాయం అందించాలనే తపనతో వైయస్ఆర్ యంత్ర సేవా పథకం కింద ట్రాక్టర్లు, కంబైన్ హార్వెస్టర్లను మెగా పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాజ‌మండ్రి పట్టణం లో  నిర్వహించిన వై. ఎస్.ఆర్.యంత్ర సేవా పథకం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి వ‌నిత స్వ‌యంగా ట్రాక్ట‌ర్‌ను న‌డిపి,అనంత‌రం రైతుల‌కు వాటిని పంపిణీ చేశారు .

Back to Top