ఎస్సీ బాలికపై అత్యాచర ఘటనలో వేగంగా శిక్ష

హోం మంత్రి, మేకతోటి సుచరిత
 

11 తారీకున బాలిక మీద అత్యాచారం జరిగింది. ఆ కేసు రిజిస్టర్ చేసిన వెంటనే నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపాము. ముఖ్యమంత్రి గారితో చర్చించి ఆ పాపకు కాంపన్సేషన్ ఇప్పించాము. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన బాలిక కనుక, ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కింద కేసు నమోదు చేసాము. నిన్ననే వెళ్లి బాధితులకు పరిహారం అందించాము. విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించడం జరుగుతుంది.
వరకట్న హత్యల గురించి సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవి. వరకట్న హత్యలు జూన్ లో 3, జులై 1, అగస్ట్ 3, సెప్టెంబర్ 2 అక్టోబర్ లో ఏమీ లేదు. వరకట్న మరణాలు జూన్‌లో 12, జులైలో 9, ఆగస్ట్ లో 8, సెప్టెంబర్ లో 9, అక్టోబర్ లో 10 మొత్తం 48 జరిగాయి. ఆత్మహత్యకు పురికొల్పడం జూన్ లో 38, జులైలో 29, ఆగస్ట్ లో 60, సెప్టెంబర్ లో 26,  అక్టోబర్ లో 35 కేసులు నమోదయ్యాయి. వేధింపుల కేసులు జూన్ లో 690, జులై లో 906, ఆగస్ట్ లో 703, సెప్టెంబర్ లో 671, అక్టోబర్ లో 645 మొత్తం 3615 కేసులు నమోదయ్యాయి. మహిళల హత్యలు జూన్ లో 23, జులైలో 23, ఆగస్ట్ లో 18, సెప్టెంబర్ లో 18, అక్టోబర్ లో 27 మొత్తం 109 కేసులు నమోదయ్యాయి. డిపి చట్టం ద్వారా జూన్ లో 90 కేసులు, జులైలో 129, ఆగస్ట్ లో 88, సెప్టెంబర్ లో 81, అక్టోబర్ లో 92 మొత్తంగా 480 కేసులు నమోదయ్యాయి.
అపహరించడం, బలవంతంగా ఎత్తుకుపోవడం జూన్ లో 76, జులైలో 75, ఆగస్టు లో 45, సెప్టెంబర్ లో 39, అక్టోబర్ లో 31 మొత్తం 266 కేసులు నమోదయ్యాయి. శీలభంగానికి సంబంధించి జూన్ లో 399, జులై లో 487, ఆగస్ట్ లో 416, సెప్టెంబర్ లో 423, అక్టోబర్లో 363 మొత్తం 2088 కేసులు నమోదయ్యాయి.  

తాజా ఫోటోలు

Back to Top