చంద్రబాబుకు జెడ్‌ ప్లస్‌ భద్రత కల్పిస్తున్నాం

హోంమంత్రి సుచరిత
 

అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబుకు జెడ్‌ ప్లస్‌ భద్రత కల్పిస్తున్నామని ఏపీ హోం మంత్రి సుచరిత పేర్కొన్నారు. 58 మంది ఇవ్వాల్సిన చోట 74 మందితో భద్రత ఇస్తున్నామని ఆమె చెప్పారు. చంద్రబాబు ప్రైవేట్‌ ఆస్తులకు రక్షణ కల్పించడం కుదరదని ఆమె తెలిపారు. అక్రమ కట్టడాల తొలగింపు అంశాన్ని పక్కదారి పట్టించేలా భద్రత అంశాన్ని తెరపైకి తెస్తున్నారని విమర్శించారు. ప్రతి విషయాన్ని రాజకీయం చేయడం తగదని హితవు పలికారు. అదనపు భద్రత కల్పించాలని చంద్రబాబు కోరితే కల్పిస్తామని స్పష్టం చేశారు. 
 

Back to Top