కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాలి

హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత

గుంటూరు: కరోనా నిబంధనలను అందరూ కచ్చితంగా పాలించాలని హోంమంత్రి మేకతోటి సుచరిత సూచించారు. కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని చెప్పారు. గుంటూరు కలెక్టర్‌లో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష అనంతరం మంత్రి సుచరిత మీడియాతో మాట్లాడారు. కరోనా నియంత్రణలో ప్రజల భాగస్వామ్యం చాలా ముఖ్యమన్నారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని, బయటకు వచ్చిన వారు భౌతిక దూరం పాటించాలని, కచ్చితంగా మాస్క్‌ ధరించాలని, శానిటైజర్‌ వాడాలని సూచించారు. తక్కువ లక్షణాలున్నవారంతా హోంక్వారంటైన్‌లో ఉండాలన్నారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top