వైయస్‌ జగన్‌ సీఎం కావడం ఖాయం

తెలుగు ప్రజలకు మంచి చేయబోతున్నాడు

ఏ పదవి ఆశించకుండానే వైయస్‌ఆర్‌ సీపీలో చేరాను

సినీ నటుడు మోహన్‌బాబు

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గెలుపు తథ్యమని, వైయస్‌ జగన్‌ సీఎం కావడం ఖాయమని సినీ నటుడు మోహన్‌బాబు అన్నారు. ఎలాంటి పదవి, ఏదీ ఆశించకుండా వైయస్‌ఆర్‌ సీపీలో చేరానని చెప్పారు. లోటస్‌పాండ్‌లో వైయస్‌ జగన్‌తో మోహన్‌బాబు, ఆయన తనయుడు మంచు విష్ణు భేటీ అయ్యారు. అనంతరం వైయస్‌ జగన్‌ సమక్షంలో మోహన్‌బాబు పార్టీలో చేరారు. అనంతరం మోహన్‌బాబు మీడియాతో మాట్లాడుతూ..  వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వల్ల తెలుగు ప్రజలకు మంచి జరగుతుందన్నారు. వైయస్‌ జగన్‌ గెలుపు కోసం హృదయపూర్వకంగా సపోర్టు చేస్తానన్నారు. ఎలాంటి పదవి ఆశించకుండా పార్టీలో చేరానని, పదవి కోసం అయితే మూడు సంవత్సరాల క్రితమే చేరేవాడినన్నారు. బంధువు అని పార్టీలో చేరలేదు.. తెలుగు ప్రజలకు మంచి చేయబోతున్నాడని పార్టీలో చేరానన్నారు. 

మూడు విడతలుగా ఫీజురియంబర్స్‌మెంట్‌ చెల్లిస్తానని చంద్రబాబు మోసం చేశాడని మోహన్‌బాబు ధ్వజమెత్తారు. దాదాపు నాలుగు సంవత్సరాలుగా రియంబర్స్‌మెంట్‌ ఆలస్యం అవుతుందని, ఫోన్‌ కాల్స్‌ ద్వారానే కాకుండా లెటర్స్‌ కూడా రాశానన్నారు. ఉత్తరాలు రాసినా సమాధానాలు లేవన్నారు. ఇప్పటికీ మీరు చెల్లించాల్సింది రూ. 19 కోట్ల చిల్లర ఉందని ఉత్తరం రాశానన్నారు. దాంట్లో 2017–18 విద్యా సంవత్సరానికి రూ. 2 కోట్ల చిల్లర రావాలని కోరామన్నారు. దీనికి ఇప్పటి వరకు చంద్రబాబు సమాధానం చెప్పలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎవరిపైనా దాడులు చేయలేదు. చేయదన్నారు.  

   
Back to Top