ప్రతి పశువుకూ హెల్త్‌ కార్డు

పశు సంవర్ధక, పాడిపరిశ్రమాభివృద్ది, మత్స్యశాఖలపై  స‌మీక్ష‌లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ 

 ప్ర‌తి మండలంలో రెండు పీహెచ్‌సీలు,  ప్రతి సచివాలయానికి ఒక విలేజీ క్లినిక్స్‌ ఈ తరహా విధానం పశు సంవర్థక శాఖలో కూడా.. 

పశువులకు వ్యాక్సినేషన్‌ పై దృష్టిపెట్టాలన్న సీఎం.

మిల్క్‌ సొసైటీల వద్ద అమూల్‌ భాగస్వామ్యంతో పాడిరైతులకు శిక్షణ

రసాయనాలకు తావులేని పశుపోషణ విధానలపై అవగాహన పెంచాలి

వచ్చే రెండు నెలల్లో మరో 1422 గ్రామాల్లోకి జగనన్న పాలవెల్లువ కార్యక్రమం

ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణంపై సీఎం ఆరా

 ఆర్బీకే స్థాయిలో ఆక్వా కొనుగోళ్లు జరిగేలా చూడాలన్న సీఎం

 అమరావతి: ప్రస్తుతం ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ప్రతి పశువుకూ హెల్త్‌ కార్డు ఇచ్చే దిశగా ఆలోచన చేయాలని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు.  దీనివల్ల వాటికి అందుతున్న వైద్య సేవలపై పర్యవేక్షణ సులభతరం అవుతుందన్నారు.  పశుసంవర్థక శాఖలో ఏ స్కీం అమలు చేసినా అర్హులందరికీ అది అందించాల‌ని ఆదేశించారు.  ఒక గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుంటే.. అందరికీ ఆ స్కీంలు అందుతాయ‌న్నారు.  వివక్ష లేకుండా అందరికీ స్కీంలు అందించాల‌న్నారు. పశు సంవర్ధక, పాడిపరిశ్రమాభివృద్ది, మత్స్యశాఖలపై తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష నిర్వ‌హించారు.  పశుసంవర్ధక, పాడిపరిశ్రమ, మత్స్యశాఖల్లో గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు ప్రగతిని అధికారులు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు వివ‌రించారు.

ఈ సందర్భంగా సీఎం వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే...:

  •  వైద్య ఆరోగ్య శాఖలో మండలానికి రెండు పీహెచ్‌సీలు, అలాగే ప్రతి సచివాలయానికి ఒక విలేజీ క్లినిక్స్‌ ఈ తరహా విధానాన్ని అమలు చేస్తున్నాం. 
  •  అలాగే పశు సంవర్థక శాఖలో కూడా ఈ తరహాలోనే పటిష్టమైన అంచెల విధానాన్ని తీసుకురావాలన్న సీఎం.
  •  యూనిఫార్మిటీ ( ఏకరూపత) తీసుకురావడం ద్వారా మంచిసేవలు అందుబాటులో తీసుకురావొచ్చు. 
  •  ఈ విధానాన్ని నిర్దేశించుకున్న తర్వాత నాడు – నేడు కార్యక్రమం ద్వారా మౌలిక సదుపాయాలను వృద్ధి చేయడంపై దృష్టిపెట్టాలి.
  •  దీనికి సంబంధించి ఒక హేతు బద్ధత ఉండాలన్న సీఎం.
  •  దీనికోసం ఒక మార్గదర్శక ప్రణాళికను తయారుచేయాలన్న సీఎం.
  •  పశువులకు వ్యాక్సినేషన్‌ పై దృష్టిపెట్టాలన్న సీఎం.
  •  లక్ష్యాలు నిర్దేశించుకుని.. ఆ మేరకు వ్యాక్సిన్లు వేయాలన్న సీఎం.
  • ప్రజారోగ్యానికి సంబంధించి గ్రామస్థాయిలో విలేజ్‌ క్లినిక్, అందులో ఏఎన్‌ఎం, అండగా ఆశావర్కర్లు ఇలా ఒక వ్యవస్థ జనరేట్‌ అయ్యింది. 
  •  అలాగే ఆర్బీకేల్లో ఉన్న పశుసంవర్థక విభాగాన్ని బలోపేతం చేయాలన్న సీఎం.
  •  యానిమల్‌ హస్బెండరీ అసిస్టెంటు సమర్ధతను పెంచాలన్న సీఎం.
  •  గ్రామస్థాయిలో ఒకరిద్దరు వాలంటీర్లను ఈ సేవల్లో నిమగ్నం చేయాలన్న సీఎం. దీనికోసం ఎస్‌ఓపీ తయారుచేయాలన్న సీఎం.
  •  ప్రతి మండల స్థాయిలో ఉన్న ఈ వ్యవస్ధ నుంచి ఆర్బీకేల్లో ఉన్న యానిమల్‌ హస్బెండరీ అసిస్టెంటుకు పూర్తిస్థాయి మద్దతు, సహకారం ఉండాలన్న సీఎం.
  •  దీనివల్ల సంతృప్తస్థాయిలో పశువులకు తగిన వైద్యం సహా పోషణ సేవలను అందించడానికి వీలవుతుందన్న సీఎం.
  •  పశుపోషణ చేస్తున్న వారి వద్ద కాల్‌సెంటర్‌ నెంబరు మరియు యానిమల్‌ హస్బెండరీ అసిస్టెంట్ నెంబర్లు అందుబాటులో ఉండాలన్న సీఎం.
  •  జగనన్న పాలవెల్లువలో భాగంగా ఏర్పాటు చేసిన మిల్క్‌ సొసైటీల వద్ద అమూల్‌ భాగస్వామ్యంతో పాడిరైతులకు శిక్షణ ఇప్పించాలన్న సీఎం.
  •  పాలల్లో రసాయనమూలకాలు ఉన్న ఉదంతాలు వెలుగు చూస్తున్నాయి. అలాంటి పరిస్థితులు రాకుండా చూడాలి. పాల నాణ్యత పెరగాలి.
  •  రసాయనాలకు తావులేని పశుపోషణ విధానలపై అవగాహన పెంచాలి.
  •  పశుసంవర్థక శాఖలో అన్ని రకాల సేవలకోసం ఒకే నంబరు వినియోగించాలన్న సీఎం.
  •  పశువుల అంబులెన్సులు నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలన్న సీఎం.
  •  దీనికోసం ఎస్‌ఓపీ రూపొందించాలన్న సీఎం. 
  •  పశువులకు సేవల్లో దేశానికి మార్గనిర్దేశంగా నిలిచామని, దాన్ని కొనసాగించాలన్న సీఎం.
  •  ఏపీలో పశువులకు వైద్య సేవలు అందిస్తున్న అంబులెన్స్‌ విధానంపై ఇతర రాష్ట్రాలు కూడా ఆసక్తి చూపాయన్న అధికారులు. 
  • పంజాబ్, చత్తీస్‌ఘడ్, కేరళకు చెందిన అధికారులు సందర్శించి వెళ్లారన్న అధికారులు. 
  •  వైయస్ఆర్ చేయూత కార్యక్రమం ద్వారా మహిళలకు జీవనోపాధి కల్పించాలన్న సీఎం.
  •  ఇప్పటికే రెండు సంవత్సరాలపాటు అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన అక్క చెల్లెమ్మలకు  ఏడాదికి రూ.18,750 చొప్పున ఇచ్చాం.
  •  ఈ డబ్బు వారి జీవనోపాధి మార్గాలను మెరుగుపరచడానికి, ఆ మార్గాలను బలోపేతంచేయడానికి ఉపయోగ పడుతుందన్న సీఎం.
  •  పశుపోషణ సహా ఇతర జీవనోపాధి మార్గాలకోసం అవసరమైన రుణాలు మంజూరు చేయించడంలో కూడా అధికారులు దృష్టిపెట్టాలన్న సీఎం.
  •  పశువులకు పంపిణీచేసిన మందులను నిల్వచేయడానికి ప్రతి ఆర్బీకేలో ఫ్రిజ్‌ సహా  అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకోవాలన్న సీఎం. 
  •  సీఎం ఆదేశాల మేరకు 4,765 ఏహెచ్‌ఏ పోస్టుల భర్తీకి చర్యలు చేపడుతున్నామని తెలిపిన అధికారులు.
  •  జగనన్న పాలవెల్లువ కార్యక్రమాన్ని సమీక్షించిన సీఎం.
  •  2.6 లక్షల మంది రైతులు పాలవెల్లువ కింద పాలు పోస్తున్నారన్న అధికారులు. 
  •  606 లక్షల లీటర్లను ఇప్పటివరకూ సేకరించామన్న అధికారులు.
  •  వచ్చే రెండు నెలల్లో మరో 1422 గ్రామాల్లోకి జగనన్న పాలవెల్లువ కార్యక్రమం.
  •  చిత్తూరు డైయిరీ పునరుద్ధరణకు వేగంగా అడుగులు ముందుకేస్తున్నామన్న అధికారులు.
  •  మరో రెండు మూడు వారాల్లో శంకుస్థాపనకు అన్నీ సిద్ధం చేయాలన్న సీఎం.
  • ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణంపైనా సమీక్ష.
  •  మొదటి విడతలో చేపట్టిన నాలుగు ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణ పనులపైనా సీఎం సమీక్ష.
  •  శీఘ్రగతిన పనులు సాగుతున్నాయని వెల్లడించిన అధికారులు.
  •  జువ్వలదిన్నెలో ఇప్పటికే   92.5శాతం పనులు పూర్తయ్యాయన్న అధికారులు.
  •  ఫిబ్రవరి 15 నాటికి జువ్వలదిన్నె పనులు పూర్తవుతాయన్న అధికారులు.
  •  నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడల్లో కూడా పనులు వేగంగా కొనసాగుతున్నాయన్న అధికారులు. ప్రతి త్రైమాసికానికి ఒకటి చొప్పున డిసెంబర్‌ నాటికి మొదటి ఫేజ్‌ ఫిషింగ్‌ హార్బర్లు అందుబాటులోకి వస్తాయన్న అధికారులు.
  •  రెండో ఫేజ్‌లో నిర్మించనున్న వాడరేవు, బుడగట్లపాలెం, పూడిమడక, కొత్తపట్నం, బియ్యపు తిప్ప ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణానికి అటవీ, పర్యావరణ సహా అన్నిరకాలుగా అనుమతులు మంజూరు అయ్యాయన్న అధికారులు. త్వరలో పనులు ప్రారంభిస్తామన్న అధికారులు.
  •  మొత్తం 9 ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణానికి రూ. 3,520.57 కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం.
  •  ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణం వల్ల జీడీపీ పెరుగుతుంది. మత్స్య ఉత్పత్తుల ఎగుమతి పెరుగుతుంది. దీనివల్ల ఆదాయాలు పెరుగుతాయన్న సీఎం.
  •  ప్రతి ఫిషింగ్‌ హార్భర్‌ నుంచి ఏడాదికి వేయి కోట్ల రూపాయలకుపైగా ఆర్థిక కార్యకలాపాలు కొనసాగుతాయన్న సీఎం.
  •  ఇది పరోక్షంగా ఆర్థికాభివృద్ధికి దారితీస్తుందన్న సీఎం.
  •  ఉపాధికోసం మన మత్స్యకారులు ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదన్న సీఎం.

 ఆక్వా రైతులకు మేలు జరగాలి.

  •  దీనికోసం ఫీడు, సీడు రేట్లపై నియంత్రణకోసం చట్టాలను తీసుకు వచ్చామన్న సీఎం. 
  •  వీటిని సమర్థవంతంగా అమలు చేయాలన్న  ముఖ్యమంత్రి.  
  •  ఆర్బీకే స్థాయిలో ఆక్వా కొనుగోళ్లు జరిగేలా చూడాలన్న సీఎం. 
  •  మధ్యవర్తుల ప్రమేయం లేకుండా చూడాలని ఆదేశం. 
  •  ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల పాత్రను ఎలా తీసివేశామో, ఈసారి ఆక్వా రంగంలోకూడా మధ్యవర్తుల ప్రమేయాన్ని తీసివేయాలన్న ముఖ్యమంత్రి. 
  •  దీనిద్వారా ఆర్బీకే వ్యవస్థను బలోపేతం చేయాలని, ఈ సీజన్లో అధికారులు దీన్ని లక్ష్యంగా పెట్టుకోవాలని ఆదేశాలిచ్చిన సీఎం. 
  •  దీనిపై అధికారులు యాక్షన్‌ ప్లాన్‌ను రూపొందించుకోవాలన్న ముఖ్యమంత్రి. 
  •  ఆక్వాలో కొత్త ప్రాసెసింగ్‌ సెంటర్లపైనా దృష్టిపెట్టాలన్న సీఎం.
  •  సహకార రంగం మాదిరిగా ఇలాంటి ప్లాంట్లు ఏర్పాటుపై తగిన ఆలోచన చేయాలన్న సీఎం.
Back to Top