చంద్రబాబు, అచ్చెన్నాయుడు తప్పించుకోలేరు

మంత్రి గుమ్మనూరు జయరాం
 

విజయవాడ : చంద్రబాబు, అచ్చెన్నాయుడు ఎన్ని కుట్రలు చేసిన ఈఎస్‌ఐ కుంభకోణం నుంచి తప్పించుకోలేరని ఆంధ్రప్రదేశ్‌ కార్మిక శాఖమంత్రి గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. చంద్రబాబు హయాంలో భారీ స్థాయిలో ఈఎస్‌ఐ కుంభకోణం జరిగిందని చెప్పారు. ఈఎస్‌ఐలో భారీ కుంభకోణం వెలుగు చూసిన నేపథ్యంలో మంత్రి స్పందించారు. మంత్రి మీడియాతో మాట్లాడుతూ..చంద్రబాబు ప్రభుత్వం కార్మికులను కూడా నిలువునా దోచుకుందని దుయ్యబట్టారు. ఈఐఎస్‌లో కుంభకోణంలో అక్రమాలకు పాల్పడినవారిని ఎవరినీ వదిలిపెట్టేది లేదని స‍్పష్టం చేశారు. అక‍్రమాలు చేసినవారిపై చర్యలు తీసుకోవడానికి విజిలెన్స్‌ విచారణకు ఆదేశించామన్నారు.  

మాజీమంత్రి అచ్చెన్నాయుడు అవినీతికి పాల్పడ్డారనడానికి ఆయన రాసిన లేఖ సాక్ష్యమని చెప్పారు. అవినీతిపై విజిలెన్స్‌ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. అక్రమంగా చెల్లించిన బిల్లుల సొమ్మును రికవరీ చేస్తామని, ఈ వ్యవహారంలో అచ్చెన్నాయుడు జైలుకు వెళ్లడం ఖాయమన‍్నారు. కేవలం మూడు సంస్థలతో కుమ్మక్కై దోపిడీ చేశారని, మందుల ధరలను భారీగా పెంచేసే దోపిడీ చేశారని మంత్రి జయరాం మండిపడ్డారు 
 

Back to Top