విఘ్నాలన్నీ తొలగిపోయి.. విజయాలు సిద్ధించాలి

వినాయక చవితి సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ శుభాకాంక్షలు 

 తాడేప‌ల్లి: రాష్ట్ర సమగ్రాభివృద్ధికి, పేదల సంక్షేమానికి ఎదురవుతున్న విఘ్నాలన్నీ తొలగిపోయి, ప్రజలందరికీ విజయాలు సిద్ధించాలని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆకాంక్షించారు. వినాయక చవితి సందర్భంగా ముఖ్యమంత్రి  వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర ప్రజలందరికీ  గణనాథుని ఆశీస్సులు ఉండాలని, క్షేమ, స్థైర్య, ఆయురారోగ్యాలు, సకల సంపదలు సిద్ధించాలని, సకల శుభాలు కలగాలని ఆకాంక్షించారు.  

రాష్ట్ర సమగ్రాభివృద్ధికి, పేదల సంక్షేమానికి ఎదురవుతున్న విఘ్నాలన్నీ తొలగిపోయి, ప్రజలందరికీ విజయాలు సిద్ధించాలని ఆకాంక్షించారు. 

విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో రాష్ట్రంలోని ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో మరింత అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ అభిలషించారు.

తాజా వీడియోలు

Back to Top