గ‌డ‌ప గ‌డ‌ప‌కు ఘ‌న స్వాగ‌తం

నెల్లూరు:  సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాల మేర‌కు రాష్ట్ర వ్యాప్తంగా గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మం నిర్విరామంగా సాగుతోంది. ప్ర‌తి ఇంటి వ‌ద్ద ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారుల‌కు ప్ర‌జ‌ల నుంచి ఘ‌న స్వాగ‌తం ల‌భిస్తోంది. శుక్ర‌వారం నెల్లూరు నగరంలోని 54వ డివిజన్ జనార్ధన్ రెడ్డి కాలనీ లోని బర్మాషెల్ గుంట, లక్ష్మీపార్వతి నగర్  ప్రాంతాలలో  గడప గడపకు మన ప్రభుత్వం 42వ రోజు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాద‌వ్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే  ప్రతి ఇంటికి వెళ్లి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి  వివరిస్తున్నారు.  స్థానిక సమస్యల గురించి అడిగి తెలుసుకొని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అనిల్ కుమార్ యాద‌వ్ హామీ ఇచ్చారు.

తాజా వీడియోలు

Back to Top