ఆళ్లగడ్డలో సీఎం వైయస్‌ జగన్‌కు ఘనస్వాగతం

నంద్యాల: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు చేరుకున్నారు. వైయస్‌ఆర్‌ రైతు భరోసా సాయం విడుదల చేసేందుకు ఆళ్లగడ్డకు చేరుకున్న‌ సీఎం వైయస్‌ జగన్‌కు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు, వైయస్‌ఆర్‌ సీపీ నాయకులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా సభా ప్రాంగణానికి చేరుకున్న సీఎం.. రైతులతో ముచ్చటించారు. వారితో ఫొటో దిగారు. సభా వేదికపై దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

Back to Top