యాసిడ్ దాడికి గురైన బాలిక కుటుంబానికి  ప్ర‌భుత్వ సాయం

రూ.10 ల‌క్ష‌ల చెక్కును అందించిన మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి
 

నెల్లూరు: చెముడుగుంట - బుజబుజ నెల్లూరు నక్కల కాలనీలో యాసిడ్ దాడికి గురైన మైనర్ బాలిక మేఘన కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఆర్థిక‌సాయం అందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మ‌రో రూ. 10 లక్షల రూపాయలు మంజూరు చేయించి, బాలిక కుటుంబ సభ్యులకు అందజేశారు. యాసిడ్ దాడికి గురైన మేఘనకు ఇప్పటికే, ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ. 20 లక్షలు మంజూరు చేయించి, మరో 10 లక్షల రూపాయల మంజూరు పత్రాన్ని  బాలిక తండ్రికి అందించారు.

మేఘనకు మెరుగైన వైద్యం కోసం చెన్నై అపోలో హాస్పిటల్ కి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 30 లక్షల రూపాయలు మంజూరు చేయించడంతో పాటు, కుటుంబ అవసరాల కోసం మరో 5 లక్షలు అందించామని మంత్రి కాకాణి వెల్ల‌డించారు. 
మైనర్ బాలిక మేఘన వైద్య అవసరాల కోసం 35 లక్షల రూపాయలు అందజేసిన ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారికి మంత్రి ధన్యవాదాలు తెలిపారు.

ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌,  మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి  తమ బిడ్డకు చేసిన సహాయానికి, తమ కుటుంబానికి అండగా నిలిచినందుకు జీవిత కాలం రుణపడి ఉంటామని బాలిక తండ్రి కృతజ్ఞతలు తెలిపారు.

Back to Top