యువతకు ఉపాధి కల్పించడమే ప్ర‌భుత్వ‌ లక్ష్యం

క‌డ‌ప‌లో స్కిల్ హ‌బ్ ప్రారంభించిన ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల‌ రామకృష్ణారెడ్డి

కడప: యువతలో నైపుణ్యాలను పెంపొందించి వారికి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా సీఎం వైయ‌స్‌ జగన్‌ చర్యలు తీసుకుంటున్నారని వైయ‌స్ఆర్ సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. వైయ‌స్ఆర్ జిల్లా జిల్లా కడపలోని ప్రభుత్వ ఐటీ కళాశాలల ఆవరణలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ(ఏపీఎస్‌ఎస్‌డీసీ) ఆధ్యర్యంలో ఏర్పాటు చేసిన స్కిల్‌ హబ్‌ను స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజ‌రై ప్రారంభించారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సంద‌ర్భంగా డిప్యూటీ సీఎం అంజద్‌బాషా మాట్లాడుతూ.. సీఎం ఆదేశాలతో ప్రతి నియోజకవర్గంలోని ప్రభుత్వ ఐటీఐ కాలేజీలో స్కిల్‌ హబ్‌లు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ప్రభుత్వ సలహాదారు(స్కిల్‌ డెవలప్‌మెంట్, శిక్షణ) చల్లా మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ.. స్థానికులకు ఉపాధి కల్పించే లక్ష్యంలో భాగంగా సీఎం వైయ‌స్‌ జగన్‌ రెండు స్కిల్ యూనివర్సిటీలు, ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఒక స్కిల్‌ కాలేజీ, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో స్కిల్‌ హబ్‌లను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.  

వృద్ధాశ్రమాన్ని ప్రారంభించిన సజ్జల  
అన్నమయ్య జిల్లా సిద్దవటం మండలంలోని నేకనాపురానికి సమీపంలో డాక్టర్‌ సంజీవమ్మ, డాక్టర్‌ తక్కోలి మాచిరెడ్డి దంపతులు నిర్మించిన జీవని వృద్ధాశ్రమాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. ఆశ్రమానికి తన వంతుగా రూ.5 లక్షల విరాళాన్ని ప్రకటించారు.

Back to Top