గడప గడపన ఘన స్వాగతం 

ప‌ల్పాడు: రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం ఉత్సాహంగా సాగుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు ఇంటింటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లుగా చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను, అమలు చేస్తున్న పథకాలను వివరిస్తున్నారు. ల‌బ్ధిదారుల‌కు బుక్‌లెట్‌లు పంపిణీ చేస్తున్నారు. గ్రామాల్లో ప‌ర్య‌టిస్తున్న నాయ‌కులు సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకుంటున్నారు. ప్రజలు చెప్పిన సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టారు. ప్రతి ఇంటి వద్ద ప్రజలు వారికి ఘనంగా స్వాగతం పలికారు. గతంలో తాము ఎదుర్కొన్న సమస్యలను, ఈ ప్రభుత్వంలో జరుగుతున్న మేళ్లను వివరించారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలతో తాము పొందిన లబ్ధి గురించి తెలిపారు. ఈ ప్రభుత్వానికి తాము అండగా ఉంటామని చెప్పారు.  

చిలక‌లూరిపేట‌లో ఆత్మీయ స్వాగ‌తం
చిలకలూరిపేట పట్టణం 34 వ వార్డ్ సుగాలి కాలనీలో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి విడ‌ద‌ల ర‌జినీకి స్థానికులు ఆత్మీయ స్వాగ‌తం ప‌లికారు.  మూడున్న‌రేళ్లలో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాల గురించి ఇంటింటికి తిరిగి రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రివర్యులు  విడదల రజిని వివ‌రిస్తున్నారు.

Back to Top