అట్ట‌హాసంగా గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం 

నంద్యాల‌:  రాష్ట్ర‌వ్యాప్తంగా గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మం దిగ్విజ‌యంగా కొన‌సాగుతోంది. సోమ‌వారం నంద్యాల జిల్లా వెలుగోడు గ్రామం జమ్మినగర్ లో అట్ట‌హాసంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ప్రారంభ‌మైంది. శ్రీ‌శైలం ఎమ్మెల్యే శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డికి ప‌ట్ట‌ణంలో ఘ‌న‌స్వాగ‌తం ల‌భించింది. గ‌జ‌మాల‌ల‌తో స‌త్క‌రించి, వీధుల వెంట పూల వ‌ర్షం కురిపించారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి ప్ర‌తి ఇంటికి వెళ్లి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మూడేళ్ల పాల‌న‌లో అందించిన సంక్షేమ ప‌థ‌కాల‌ను వివ‌రిస్తున్నారు. స్థానికుల నుంచి వ‌చ్చిన స‌మ‌స్య‌ల‌కు అక్క‌డిక్క‌డే ప‌రిష్కారం చూపుతున్నారు. మ‌ళ్లీ వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని ఆశీర్వ‌దించాల‌ని, 2024లో అత్య‌ధిక మెజారిటీతో వైయ‌స్ఆర్‌సీపీని గెలిపించాల‌ని ఎమ్మెల్యే శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. అనంతరం జమ్మినగర్ సమీపంలోని శమీ వృక్షం వ‌ద్ద భక్తుల సౌకర్యార్థం సీసీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు.  బోయరేవుల గ్రామంలోని సామేలు అనే రైతు ఆత్మ‌హ‌త్య చేసుకోగా ప్ర‌భుత్వం నుంచి మంజూరైన న‌ష్ట‌ప‌రిహారం రూ.7 ల‌క్ష‌ల చెక్కును ఎమ్మెల్యే శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి రైతు కుటుంబ  స‌భ్యుల‌కు అంద‌జేశారు. 

Back to Top