ఉరవకొండ: నవరత్నాలతో గడప గడపలో సంతోషం వెల్లివిరుస్తోందని వైయస్ఆర్ సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. ఉరవకొండ పట్టణంలోని సచివాలయం-3 పరిధిలోని 2వ వార్డు, శాంతి నగర్‌లో 'గడపగడపకు మన ప్రభుత్వం' కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి హాజరయ్యారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందు కృషిచేస్తామని హామీ ఇచ్చారు. అదే విధంగా ప్రభుత్వ పథకాలు అర్హులకు సక్రమంగా అందుతున్నాయ లేదా అని గడప గడపకూ వెళ్లి ప్రజలనుంచి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి సానుకూల స్పందన లభించిందన్నారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, సచివాలయ సిబ్బంది, వలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.