సీఎం వైయ‌స్‌ జగన్ పాలనలో గ్రామాభివృద్ధికి బాటలు 

ఉరవకొండ వైయ‌స్ఆర్ సీపీ ఇన్‌చార్జ్‌, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి

ఉరవకొండ: గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జగన్‌మోహ‌న్ రెడ్డి నిజం చేసి చూపించారని ఉరవకొండ వైయ‌స్ఆర్ సీపీ ఇన్‌చార్జ్‌, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. బెలుగుప్ప మండలం కాలువపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన వైయ‌స్ఆర్ విలేజ్ క్లినిక్, రైతు భరోసా కేంద్రాన్ని విశ్వేశ్వరరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా విశ్వేశ్వ‌ర్‌రెడ్డి మాట్లాడుతూ.. గ్రామాల ప్రగతే దేశాభివృద్ధికి నిదర్శమని గుర్తించిన ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్ గ్రామాల్లో అన్ని వసతులు కల్పించి అభివృద్ధికి బాటలు వేశారని తెలిపారు. ఓ వైపు అభివృద్ధి, మరో వైపు సంక్షేమంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారన్నారన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి రైతులకు తోడ్పాటు అందిస్తూనే ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేస్తూ అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు, వైయ‌స్ఆర్ సీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

Back to Top