నేతన్నలకు కొండంత అండగా సీఎం వైయ‌స్‌ జగన్ 

అనంత‌పురం జిల్లాలో 9,650 మంది చేనేత‌ల‌కు ల‌బ్ధి

వైయ‌స్ఆర్ నేత‌న్న‌ నేస్తం కార్య‌క్ర‌మంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వ‌ర్‌రెడ్డి

ఉరవకొండ: వైయ‌స్‌ఆర్‌ నేతన్న నేస్తం పథకం ద్వారా నేతన్నల కుటుంబాలకు ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆర్థికంగా కొండంత అండగా నిలుస్తున్నారని ఉరవకొండ నియోజ‌క‌వ‌ర్గ వైయ‌స్ఆర్ సీపీ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్ వ‌రుస‌గా నాల్గ‌వ ఏడాది కృష్ణా జిల్లా పెడన నుంచి కంప్యూటర్‌ బటన్‌ నొక్కి వైయ‌స్‌ఆర్‌ నేతన్న నేస్తం కింద‌ లబ్ధిదారుల ఖాతాల్లో రూ.24 వేల చొప్పున‌ జమ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతపురంలో స్థానిక కలెక్టరేట్‌ విసి హాలులో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్‌ నాగలక్ష్మి సెల్వరాజన్, పాటు, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ గిరిజమ్మ తదితరులు హాజరయ్యారు. ముఖ్యమంత్రి ప్రత్యక్ష ప్రసారం ముగిసిన అనంతరం స్థానిక విసి హాలులో నేత‌న్న నేస్తం పథకం ద్వారా జిల్లాలోని 9,650 మంది లబ్దిదారులకు మంజూరైన రూ. 23.16 కోట్ల మెగా చెక్కును ల‌బ్ధిదారుల‌కు కలెక్టర్‌, మాజీ ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. నేతన్నలకు వరుసగా నాల్గ‌వ ఏడాది వైయ‌స్ఆర్‌ నేతన్న నేస్తం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించడం అభినందనీయం అన్నారు. కార్యక్రమంలో చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకులు సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, చేనేత కార్మిక లబ్ధిదారులు, చేనేత కార్మిక సంఘాల నేతలు, మహిళలు పాల్గొన్నారు.

Back to Top