టీడీపీ డైరెక్ష‌న్‌లో మాట్లాడుతున్నారు 

మాజీమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ రీజనల్ కో ఆర్డినేటర్ బాలినేని శ్రీ‌నివాస‌రెడ్డి

ప్రకాశం:  నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి టీడీపీ డైరెక్షన్ లో మాట్లాడుతున్నాడని మాజీమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ రీజనల్ కో ఆర్డినేటర్ బాలినేని శ్రీ‌నివాస‌రెడ్డి వ్యాఖ్యానించారు. ‘‘ఫోన్ ట్యాపింగ్ లేదు.. పాడు లేదు.. మంత్రి పదవి ఇవ్వలేదనే అక్కసుతోనే శ్రీధర్ రెడ్డి, ఆనం డ్రామాలు ఆడుతున్నారు. దమ్ముంటే ఫోన్ ట్యాపింగ్ అయినట్టు నిరూపించాలని సవాల్‌ విసిరారు బాలినేని. ఫోన్ ట్యాప్ అయితే ఎమ్మెల్యే ఆనం ఇన్ని రోజులు ఎందుకు బయటపెట్టలేదని నిలదీశారు. రేపో ఎల్లుండో నెల్లూరు రూరల్ కి కొత్త ఇంచార్జి నియామకం ఉంటుందని, వాళ్లిద్దరూ కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని బాలినేని మండిపడ్డారు. వైయ‌స్ఆర్‌సీపీలో నాయకులకు కొదవలేదు.. ఒకరు పోతే పది మంది తయారవుతారని బాలినేని వ్యాఖ్యానించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top