ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబు ఫెయిల్ 

మహిళా హోం మంత్రిగా ఉన్న రాష్ట్రంలో మహిళలకే రక్షణ లేదు

మాజీ మంత్రి ఆర్కే రోజా ఫైర్‌

చిత్తూరు:  ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబు నాయుడు ఫెయిల్ అయ్యార‌ని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి, మాజీ మంత్రి ఆర్కే రోజా విమ‌ర్శించారు. చిత్తూరు జిల్లాలో మైనారిటీ మ‌హిళ‌పై పోలీసుల లైంగిక వేధింపుల ఘ‌ట‌న‌పై రోజా స్పందించారు. ఈ సంద‌ర్భంగా గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ..` సీఎం చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది. కష్టాలు వస్తే పోలీస్ స్టేషన్ కు వెళ్తే ఈరోజు రక్షణ లేని పరిస్థితి. మైనారిటీ మహిళపై జరిగిన అత్యాచారం కేసులో నిందితులను కటినంగా శిక్షించాలి. మహిళా హోం మంత్రిగా ఉన్న రాష్ట్రంలో మహిళలకే రక్షణ లేదు. కానిస్టేబుల్ ఉమా శంకర్, హోం గార్డు కిరణ్ ను తక్షణమే శిక్షించాలి. సంబంధం లేని శాఖలు గురించి మాట్లాడటం కాదు, ముందు నీ హోం శాఖ గురించి హోం మంత్రి అనిత‌ సమీక్ష, ప్రక్షాళన చేయాలి. ఈవీఎం లు ప్రభుత్వం అని ఇప్పుడు అర్ధమ‌వుతోంది.  ప్రజలకు అన్యాయం జరిగితే కనీసం స్పందించడం లేదు, తప్పు సరిద్దుకోవడం లేదు. పోలీసులు ను సక్రమంగా పనిచేయించడం లేదు. సోషల్ మీడియా యాక్టివిస్ట్ పై తప్పుడు కేసులు పెడుతున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు, గంజాయి కేసులు పెడుతున్నారు. ఎన్నికలు ముందు పవన్ కళ్యాణ్ ఏమి చెప్పారు, మహిళలు కు అన్యాయం జరిగితే తాట తీస్తామని చెప్పిన వ్యక్తి ఈ రోజు ఏం చేస్తున్నారు. సొంత నియోజకవర్గంలో మహిళపై అత్యాచారం జరిగితే కూడా పవన్ కళ్యాణ్ స్పందించడు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పి ప్రజల్ని మోసం చేశారు. ప్రజల్ని మోసం చేసే చంద్రబాబుకు మద్దతుగా నిలిస్తే ప‌వ‌న్ క‌ళ్యాణ్ చరిత్ర హీనుడుగా మిగిలి పోతాడు. పోలీసులు ఆలోచన చేయాలి, బాధితులకు న్యాయం చేయాలి. ప్రజలకు న్యాయం చేయాలి.ఇలాగే పనిచేస్తే హోం మంత్రిని ప్రజలు ఇంటికి పంపిస్తారు, ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపిస్తారు` అని రోజా హెచ్చ‌రించారు. 

Back to Top