మచిలీపట్నం:కెన్‌స్టార్‌షిప్‌లోకి వెళ్లకూడదని పవన్‌కల్యాణ్‌కు చంద్రబాబు చెప్పారా అని మాజీ మంత్రి పేర్నినాని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం పోర్టు ఓనర్ అయితే అరబిందో కంపెనీ ప్రస్తావన ఎందుకు వచ్చిందో చెప్పాలని ఆయన డిమాండు చేశారు. డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఇటీవలి కాకినాడ పోర్టు పర్యటనపై మాజీ మంత్రి పేర్నినాని సంచలన ఆరోపణలు చేశారు. స్టెల్లాషిప్‌ను తనిఖీ చేసిన పవన్ కల్యాణ్ కెన్‌స్టార్‌షిప్‌ను ఎందుకు వదిలేశారని మాజీ మంత్రి పేర్నినాని ప్రశ్నించారు. ప్రస్తుత ఆర్థిక మంత్రి వియ్యంకుడు అందులో బియ్యం తరలిస్తున్నారని తమకు సమాచారం ఉందన్నారు. తన ప్రశ్నలకు కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కెన్‌స్టార్‌షిప్‌లోకి వెళ్లేందుకు అనుమతి లేదంటున్నారని, అక్కడే ఉన్న అధికారులు కాకుండా ఇంకెవరు అనుమతి ఇవ్వాలో స్పష్టం చేయాలన్నారు. ఈ విషయమై మచిలీపట్నంలో పేర్నినాని సోమవారం మీడియాతో మాట్లాడారు. ఆ షిప్ వరకు ఎందుకు వెళ్లలేదు?: – తన శాఖ కాకపోయినా ప్రాణాలకు తెగించి ప్రజల ఆస్తిని కాపాడటానికి, షిప్‌ను తనిఖీ చేయడం కోసం సముద్రంలోకి వెళ్లిన డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ను వ్యక్తిగతంగా అభినందిస్తున్నా. కాకపోతే దానిపై మాకు కొన్ని అనుమానాలున్నాయి. – పవన్‌కళ్యాణ్ ప్రాణాలకు తెగించి సముద్రంలో ‘స్టెల్లా’ షిప్ వరకు మాత్రమే ఎందుకు వెళ్లారు? పక్కనే ఉన్న ‘కెన్‌స్టార్’ షిప్ వద్దకు ఎందుకు వెళ్లలేదు? కేవలం ‘స్టెల్లా’ చుట్టూనే ఎందుకు రౌండ్లు కొట్టి షూటింగ్ చేశారు?. ఎల్లో మీడియా సమాచారం ప్రకారం: – కాకినాడ పోర్టులో డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ హడావుడి గురించి ఎల్లో మీడియాకు చెందిన రెండు పేపర్లు, 10 టీవీ ఛానళ్ల విలేకరులతో నేను మాట్లాడాను. – వారిచ్చిన సమాచారం ప్రకారం ‘స్టెల్లా’లో 36 మంది ట్రాన్స్‌పోర్టర్లు, 35 వేల టన్నుల బియ్యం ఎగుమతి చేయడానికి తెచ్చుకున్నారని తెలిసింది. – అక్కడి వరకు వెళ్లిన పవన్‌కళ్యాణ్, ఆ పక్కనే లంగరేసి ఉన్న మరో షిప్ ‘కెన్‌స్టార్’లో ఒకే ఎక్స్‌పోర్టర్ 42 వేల టన్నుల బియ్యం నైజీరియాకి ఎగుమతి చేస్తున్నా దాని జోలికి మాత్రం పోలేదని తెలిసింది. అక్కడికెళ్లి ఆ మాటెందుకు అనలేదు?: – డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ సముద్రంలో ‘స్టెల్లా’ షిప్ దగ్గరే ఎందుకు ఆగిపోయారు?. ‘కెన్‌స్టార్’ దగ్గరకు కూడా పోయి.. ‘సీజ్ ది షిప్. ఐ విల్ టాక్ టుది సెంట్రల్ గవర్నమెంట్’.. అని ఎందుకు అనలేదు?. – ‘కెన్‌స్టార్’ షిప్ రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వియ్యంకుడు (కోడలి తండ్రి) వేల్లూరి శ్రీనుకి చెందింది కావడమే కారణమని విలేకరులే చెప్పారు. – సముద్రంలో అంతదూరం వెళ్లిన పవన్‌కళ్యాణ్, ఒక షిప్ తనిఖీ చేసి, పక్కనే లంగరేసి ఉన్న మరో షిప్ వద్దకు కూడా వెళ్లి, దాంట్లో పీడీఎస్ బియ్యం ఉందో? లేదో? చూడరా? తనిఖీ చేయరా? పవన్‌కళ్యాణ్ ఆ షిప్ దగ్గరకు వెళ్లకుండా చంద్రబాబు ఆపేశారా? లేక ఆయన కళ్లకు చంద్రబాబు గంతలు కట్టారా?. – నాకున్న అవగాహన మేరకు, డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్‌కళ్యాణ్ ఏదైనా షిప్‌లోకి వెళ్లాలంటే కస్టమ్స్, పోర్టు అథారిటీ అనుమతులు కావాలి. పోర్టు అథారిటీ అంటే రాష్ట్ర ప్రభుత్వమే. పోర్టు ఆఫీసర్, కస్టమ్స్ అధికారులిద్దరూ ఆయన పక్కనే ఉన్నారు. అయినా ఆయన కెన్‌స్టార్ దగ్గరకు వెళ్లలేదు!. – అంటే, పవన్‌ను సీఎం చంద్రబాబు అయినా ఆపేసి ఉండాలి. లేదా అక్కడికి వెళ్లడానికి తనకు అధికారులు అనుమతి ఇవ్వలేదని పవన్‌కళ్యాణ్ అబద్ధమైనా చెప్పుండాలి. – షిప్ మంత్రి వియ్యంకుడికి సంబంధించిదైతే తనిఖీ చేయకుండా వదిలేస్తారా? దీనికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ ఇద్దరూ కచ్చితంగా సమాధానం చెప్పాలి. అదే నిజమైతే సీజ్ చేయండి: – డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ ఆరోపించినట్లు, స్టెల్లా షిప్‌లో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి లేదా ఆయన సోదరుడికి చెందిన బియ్యం లేవు. – ఇది నిజం. కావాలంటే విచారణ చేయండి. ఒకవేళ అవి వారికి చెందిన బియ్యం అని విచారణలో తేలితే సీజ్ చేసుకోవచ్చు. ఎవరిది డ్రామా?. ఏమిటా పిచ్చి రాతలు?: – బియ్యం స్మగుల్ గూడ్స్ కిందకు రాదని, షిప్‌ను సీజ్ చేసే అధికారం లేదని ఆంధ్రజ్యోతిలో రాస్తున్నారు. – అసలు ఏమిటీ డ్రామా? ఎవరిదీ డ్రామా? సీఎం చంద్రబాబుదా? డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌దా? లేక ఏబీఎన్ రాధాకృష్ణదా?. – కాకినాడ యాంకరేజ్ పోర్టులో అరబిందోకి వాటా ఉందా? ఏమిటా పిచ్చి రాతలు? యాంకరేజ్ పోర్టు ఓనర్ ఎవరు? రాష్ట్ర ప్రభుత్వమే కదా?. – ఎవరిని ఏమారుద్దామని మీ ప్రయత్నం?. ఏదో జరుగుతుంటే వైఎస్ జగన్‌పై బురద జల్లాలనే మీ ప్రయత్నమా? అని పేర్ని నాని ఆక్షేపించారు.