ప్రాణహాని ఉంటే ఏనాడైనా పోలీసులకి చెప్పాడా..?

 మాజీ మంత్రి పేర్ని నాని

విజ‌య‌వాడ‌: ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న‌కు ప్రాణ హాని ఉంద‌ని ఏనాడైనా పోలీసుల‌కు ఫిర్యాదు చేశారా అని వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి, మాజీ మంత్రి పేర్ని నాని ప్ర‌శ్నించారు. కాకినాడ స‌భ‌లో ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌కు పేర్ని కౌంట‌ర్ ఇచ్చారు. పవనికి ఉంటే చంద్రబాబు వల్లే ప్రాణహాని ఉంటుంద‌ని పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ సినిమాల్లో తప్ప బయట ఎవర్ని కొట్టలేడ‌ని ఎద్దేవా చేశారు. కాపులను మోసం చేయడానికి సీఎం అవుతా అంటున్నాడ‌ని, గతంలో అరాచకంగా పాలించిన చంద్ర‌బాబును పవన్ గుడ్డలిప్పి కొట్టాడా..? అని ప్ర‌శ్నించాడు. లోకేష్ అవినీతి పరుడని పవన్ ఆరోపించలేదా?..లోకేష్ ని గుడ్డలిప్పి పవన్ కొట్టగలిగాడా..? అని నిల‌దీశారు.  సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ఒడించడం పవన్ వల్ల కాద‌ని హెచ్చ‌రించారు. 

Back to Top