వైయ‌స్ఆర్‌సీపీ బలోపేతానికి కృషి చేద్దాం 

వైయ‌స్ఆర్‌సీపీ రీజిన‌ల్ కో-ఆర్డినేట‌ర్ పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి పిలుపు

నంద్యాల జిల్లా విస్తృత స్థాయి స‌మావేశం

నంద్యాల‌:  ప్ర‌తి ప‌ల్లెలోనూ వైయ‌స్ఆర్‌సీపీ బలోపేతానికి కృషి చేద్దామ‌ని వైయ‌స్ఆర్‌సీపీ రీజిన‌ల్ కో-ఆర్డినేట‌ర్ పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి పిలుపునిచ్చారు. నంద్యాల జిల్లా అధ్యక్షుడు  కాటసాని రాంభూపాల్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన జిల్లా విస్తృత స్థాయి సంస్థాగత సమావేశానికి ముఖ్య అతిధులుగా రీజినల్-కో- ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, మాజీ మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా కోటి సంత‌కాల సేక‌ర‌ణ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. గ్రామాల్లో నిర్వ‌హిస్తున్న ర‌చ్చ‌బండ కార్య‌క్ర‌మంపై పార్టీ నేత‌ల‌కు పెద్దిరెడ్డి దిశానిర్దేశం చేశారు.  స‌మావేశంలో నంద్యాల పార్లమెంట్ పరిశీలకురాలు ఎమ్మెల్సీ కల్పలత రెడ్డి రు, నంద్యాల మాజీ ఎంపీ పొచ బ్రహ్మానంద రెడ్డి , కర్నూల్ పార్లమెంట్ పరిశీలకులు గంగుల ప్రభాకర్ రెడ్డి , ఎమ్మెల్సీ ఇషాక్ బాషా, శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి , బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామి రెడ్డి ,నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిరెడ్డి ,ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల నాని , నందికొట్కూరు ఇంచార్జి ధార సుదీర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Back to Top