పొగాకు రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోర వైఫల్యం

కొనుగోలు చేసే వారు లేక అల్లాడుతున్న పొగాకు రైతులు

పొగాకు రైతులకు అండగా ఈ నెల 28న వైయస్ జగన్ పొదిలి పర్యటన

ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పొగాకు కొనుగోళ్ళు చేయించే వరకు పోరాటం

ఏపీలో కక్షారాజకీయాలు పరాకాష్టకు చేరాయి

మాజీ మంత్రి మేరుగు నాగార్జున 

తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి మేరుగు నాగార్జున

గుండ్లపాడు జంటహత్యలపై దుర్మార్గమైన రాజకీయం

సాక్షాత్తు జిల్లా ఎస్పీ ఇచ్చిన స్టేట్‌మెంట్‌ని నవ్వులపాలు చేశారు

సంబంధం లేని వైయస్ఆర్‌సీపీ నేతలను కుట్రపూరితంగా ఇరికిస్తున్నారు

మాజీమంత్రి మేరుగు నాగార్జున ఆగ్రహం

తాడేపల్లి: రాష్ట్రంలో కొనుగోలు చేసేవారు లేక పొగాకు రైతులు అల్లాడుతుంటే కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు మేరుగు నాగార్జున మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ తెల్ల, నల్లబర్లీ పొగాకు సాగు చేసిన రైతులు కొనేవారు లేక, పంటలను ఏం చేసుకోవాలో తెలియక ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ఈ ప్రభుత్వంలో కొద్దిపాటి చలనం కూడా కనిపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొగాకు రైతులకు అండగా ఈ నెల 28వ తేదీన మాజీ సీఎం, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ ప్రకాశం జిల్లా పొదిలిలో పర్యటిస్తున్నారని వెల్లడించారు. ఈ ప్రభుత్వం మెడలు వంచి, పొగాకు కొనుగోళ్ళు జరిపించే వరకు రైతులతో కలిసి వైయస్ఆర్‌సీపీ ఉద్యమిస్తుందని వెల్లడించారు. 

ఇంకా ఆయనేమన్నారంటే...

మెట్టప్రాంతంలో పొగాకు కొనుగోళ్ళు లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. నేరుగా రోడ్లమీదికి వచ్చి ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా చోద్యం చూస్తోంది. ఆనాడు పొగాకు కొనుగోళ్లలో ఇలాంటి ప్రతిష్టంభన ఏర్పడితే వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం ముందుకు వచ్చి మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోళ్ళు చేయించింది. వ్యాపారులు ముందుకు వచ్చి కొనుగోళ్ళు చేయకపోతే మార్కెఫెడ్ ద్వారా రూ.118 కోట్లతో పొగాకు కొనుగోళ్ళు చేసి వైయస్ జగన్ రైతులను ఆదుకున్నారు. 

పొగాకు రైతుల గోడు వర్ణనాతీతం

నేడు క్వింటా పొగాకు రూ.10 నుంచి రూ.15వేలకు కూడా కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ముందుకు రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు కనీసం కూలి ఖర్చులు కూడా గిట్టుబాటు కాక, పూర్తిగా నష్టపోయే ప్రమాదంలో ఉన్నారు. ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో రైతులు పెద్ద ఎత్తున తెల్లబర్లీ, నల్లబర్లీ పొగాకు సాగు చేశారు. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో ఇదేరకం పొగాకు క్వింటా రూ.15వేలకు కొనుగోలు చేశారు. కానీ నేడు క్వింటా రూ.5వేలకు కూడా కొనుగోలు చేసేవారు కనిపించడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. పొగాకు కౌలురైతుల పరిస్థితి మరీ దారుణంగా మారింది. తాజాగా వ్యవసాయశాఖ మంత్రి పర్చూరు ప్రాంతంలో మీటింగ్ పెట్టి రైతులను ఆదుకుంటామని, గిట్టుబాటు రేటుకు కొనుగోళ్ళు చేయిస్తామని శుష్కవాగ్ధానాల చేసి వెళ్లిపోయారు. దీనిపై ప్రభుత్వ కార్యాచరణ ఏమిటో ప్రకటించాలి. ప్రైవేటు కంపెనీలు కొనుగోలుకు ముందుకు రాకపోతే ప్రభుత్వం నుంచి కొనుగోళ్ళు చేయించాలి. ప్రభుత్వం ఆదుకోకపోతే రైతుల ఆత్మహత్యలు తప్పవనే ఆవేదన రైతుల్లో వ్యక్తమవుతోంది. పొగాకు రైతులకు భరోసా కల్పించేందుకు ఈ నెల 28వ తేదీన మాజీ సీఎం, వైయస్ఆర్సీపీ అధినేత వైయస్ జగన్ ప్రకాశం జిల్లా పొదిలిలో పర్యటించబోతున్నారు. రైతుల్లో భరోసాను కల్పించబోతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్రంలో వ్యవసాయాన్ని, రైతాంగాన్ని పూర్తిగా సంక్షోభంలోకి నెట్టేసింది. పండించిన పంటలకు రేటు లేక అమ్ముకునే స్థితిలో రైతులు లేరు. ధాన్యం, మిరప, పొగాకు, మిర్చి ఇలా ఏ పంట చూసినా కనీస మద్దతుధర లభించడం లేదు.

పోలీస్ వ్యవస్థను దిగజార్చారు

ఏపీలో కక్ష్యారాజకీయాలు పరాకాష్టకు చేరాయి. రాజ్యాంగ వ్యవస్థలను నీరుగారుస్తున్నారు. పల్నాడు జిల్లా గుండ్లపాడులో చనిపోయిన కుటుంబసభ్యులు అసలు దోషులను వదిలి, సంబంధం లేని వారిని ఇరికిస్తున్నారని చెబుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు. ఆదిపత్య పోరుతోనే ఈ జంటహత్యలు జరిగాయని జిల్లా ఎస్పీ చెప్పిన మాటలకు కూడా విలువ లేకుండా చేశారు. స్థానిక టీడీపీ ఎమ్యెల్యే చెప్పారంటూ వైయస్ఆర్‌సీపీకి చెందిన పిన్నెల్లి సోదరులపై తప్పుడు కేసులు బనాయించడం చూస్తుంటే, ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఎంత దారుణంగా నిర్వీర్యమయ్యిందో అర్థమవుతోంది. అలాగే ఇటీవల జంగారెడ్డిగూడెంలో కల్తీమద్యం మృతులు అంటూ కొత్త అంశాన్ని తెరమీదికి తీసుకువచ్చారు. ఈ ఘటనలు ఎప్పుడు జరిగింది, ఆనాడు అధికారులు వీటిపై ఇచ్చిన నివేదికలు ఏమిటీ? ఇవ్వన్నీ పక్కకు పెట్టి రాజకీయ కుట్రలకు ఆ మరణాలను వాడుకోవాలని చూడటం దుర్మార్గం. ఎవరైనా కుటుంబంలో వ్యక్తి చనిపోతే ఆ కుటుంబసభ్యులకు సహజంగానే బాధ ఉంటుంది. దానిని అడ్డం పెట్టకుని రాజకీయంగా బుదరచల్లే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజాస్వామిక వ్యవస్థ రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి. రెడ్‌బుక్‌ రాజ్యాంగంతో ప్రతిదానిని వేధింపులకు, కక్షసాధింపుకు వాడుతున్న కూటమి ప్రభుత్వం ఎల్లకాలం అధికారంలో ఉంటుందా? శాంతిభద్రతలు అనే అంశానికే ఏపీలో ఆస్కారం లేకుండా నవ్వులపాలు చేస్తున్నారు.చంద్రబాబు పాలనలో ఏ రంగంలోనూ అభివృద్ధి అనేదే కనిపించడం లేదు. రాష్ట్ర ప్రజలను తిరోగమనం వైపు నడిపిస్తున్నారు.

Back to Top