విజయవాడ: ఈ ప్రభుత్వం ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా భయపడేది లేదని, చచ్చేదాకా వైయస్ జగన్ వెంటే ఉంటానని మాజీ మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. చావడానికైనా సిద్ధమే కాని వైయస్ జగన్‌ను వదిలే ప్రసక్తే లేదని ఉద్ఘాటించారు. విజయవాడ జిల్లా జైల్ వద్ద కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. `మా పార్టీ అధికారంలోకి వస్తుంది. తప్పు చేసిన అధికారులను, నాయకులను ఎవర్ని వదలను అని వైయస్ జగన్ చెబుతున్నాడు. ముందుంది ముసళ్ల పండుగ , ఏదీ కూడా మరిచిపోయేది లేదు. వైయస్ జగన్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి, పేద ప్రజలు సంక్షేమానికి, అభివృద్ధికి నోచుకోవాలి. జగన్ 2.0లో ఎవరి స్థాయికి తగ్గట్టు వారికి అట్టుపెట్టి వాత పెడతాం. దొంగలు, అక్రమ కేసులు పెట్టిన వారిని జీవితకాలం జైల్లో పెడతాం` అని కొడాలి నాని హెచ్చరించారు. ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు దిమ్మతిరిగే ఆన్సర్ అండర్ గ్రౌండ్ కు వెళ్లి దాక్కున్నాడు అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో... సదరు రిపోర్టర్ కు కొడాలి నాని దిమ్మ తిరిగిపోయేలా ఆన్సర్ ఇచ్చారు. ఎల్లో మీడియా ప్రతినిధులందరి ఇంటికి ప్రతిరోజు వచ్చి కలుస్తా అంటూ... చురకలాంటించాడు. తాను ఏ రెడ్‌బుక్‌కు భయపడేది లేదని.. వచ్చేది తమ ప్రభుత్వం అని ధీమా వ్యక్తం చేశారు. అధికారం ఉన్నన్ని రోజులు మీడియా ముందుకు వచ్చామని... ఇప్పుడు అధికారం లేదు కాబట్టి రావడం లేదని తెలిపారు. కానీ అరెస్టుకు తాను ఎక్కడ భయపడేది లేదని వివరించారు. ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసిన... అరెస్టు చేసిన కూడా తగ్గేదే లేదు అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు కొడాలి నాని. ప్రజలు తమ ఉద్యోగం పీకాసారని.. అందుకే ఆక్టివ్ గా లేనని... చెప్పుకొచ్చారు. మళ్లీ ఆ ఉద్యోగం వచ్చిన తర్వాత.. తమ ప్రతాపం చూపిస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు కొడాలి నాని. బి ఆర్ నాయుడు అలాగే ఏబీఎన్ రాధాకృష్ణ ఇంటికి వస్తేనే.. మేం ఆక్టివ్ గా ఉన్నట్లా? అంటూ ఓ రిపోర్టర్ ను కొడాలి నాని నిలదీశారు.