మూడు ప్రాంతాల అభివృద్ధి కోసమే వికేంద్రీకరణ

 సీఎం వైయ‌స్ జ‌గ‌న్ 3 ప్రాంతాల ఆకాంక్షలను తీర్చే ప్రయత్నం చేస్తున్నారు 

మాజీ మంత్రి కొడాలి నాని

అమ‌రావ‌తి:   కులాలు, మతాలు, రాజకీయాలకు అతీతంగా సీఎం వైయ‌స్ జగన్‌ పాలన సాగిస్తున్నార‌ని మాజీ మంత్రి కొడాలి నాని తెలిపారు. మూడు ప్రాంతాల అభివృద్ధి కావాలంటే పరిపాలన వికేంద్రకరణ జరగాలని సీఎం వైయ‌స్ జగన్‌ మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చారు. ఒక కులానికో, మతానికో వ్యతిరేకంగా వికేంద్రీకరణ చేయడం లేదు. మూడు ప్రాంతాల అభివృద్ధి కోసమే వికేంద్రీకరణ. సీఎం జగన్‌పై బురద జల్లడమే కొందరు పనిగా పెట్టుకున్నార‌ని మండిప‌డ్డారు.  వికేంద్రీక‌ర‌ణ‌పై అసెంబ్లీలో జ‌రిగిన చ‌ర్చ‌లో కొడాలి నాని మాట్లాడారు.

సీఎం వైయ‌స్ జగన్ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండీ ఆయన, ఆయన ప్రభుత్వం నడుస్తున్న విధానాన్ని పరిశీలిస్తే ఎక్కడా కులాలకీ, మతాలకి, రాజకీయాలకీ సంబంధం లేకుండా ప్రతి వ్యక్తికీ, ప్రతి ప్రాంతానికీ మంచి చేయాలి, అన్ని ప్రాంతాలనూ సమానంగా చూడాలి, అందరినీ చేయపట్టి ముందుకు నడిపించాలనే ఉద్దేశ్యం ఆయనలో ఉంది. 

వికేంద్రీకరణ అంటే మూడు ప్రాంతాల్లో 3 రాజధానులు పెట్టడం మాత్రమే కాదు, ప్రతి 2వేల మందికి ఒక గ్రామ సచివాలయం ఉండాలి, అందులో 10 మంది ఉద్యోగులు ఉండాలి, ఆ ప్రాంతంలోఉన్న ప్రతి ఒక్కరికీ సేవలందాలి. వీటికోసం ప్రజలు ఏ మండలాఫిసుకో, మున్సిపల్ ఆఫీస్ కో వెళ్లాల్సిన అవసరం రాకూడదు. ప్రతి వార్డులోనూ, ప్రతి గ్రామంలోనూ సచివాలయం ఉండాలి, అక్కడ ఉద్యోగులు ఉండాలి. ఒక అప్లికేషన్ వచ్చిన 24గంల్లో పరిష్కారం చేయాలి. 16వేల గ్రామ, వార్డు సచివాలయాలు పెట్టిన వ్యక్తి వైయస్ జగన్. 

26 జిల్లాలను ఏర్పాటు చేసి జిల్లాకి ఒక కలెక్టర్ ని, ఒక ఎస్పీని, కొంతమంది అధికారులను అదనంగా నియమించి, ప్రతి జిల్లానూ తక్కువ మంది ప్రజలతో, ఎక్కువ మంది అధికారులతో అభివృద్ధి చేసే అవకాశం ఉండేలా జిల్లాలను వికేంద్రీకరించి 26 జిల్లాలుగా చేసారు వైయస్ జగన్. 

కొత్తగా లక్షా ముఫై వేల మందికి గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలు ఇచ్చి, రెండేళ్లు కాగానే ప్రభుత్వ స్కేలు ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారు. కళ్లుండి గుడ్డోళ్లు కొందరు, చెవులున్నా వినలేని చెవిటివాళ్లు కొందరు మాత్రం యువతకు ఉద్యోగాలు రాలేదని నిరసనలు చేస్తున్నారు. 

2019డిసెంబర్ లో ప్రభుత్వం వచ్చాక 6 నెలల్లో మూడు ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలంటే పరిపాలనా వికేంద్రీకరణ జరగాలి అన్నారు. గతంలో రాజధానిగా ఉండి తర్వాత తొలగించబడ్డ రాయలసీమ కర్నూలులో ఎప్పటి నుండో ప్రజలు అక్కడ హైకోర్టు రావాలని కోరుకుంటున్నారు. అందుకే సీఎం జగన్ కర్నూలులో హైకోర్టు పెట్టాలని ఇదే అసెంబ్లీలో నిర్ణయం తీసుకున్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా తాము అధికారంలోకి వస్తే కర్నూలులో హైకోర్టు ఇస్తామని తమ మేనిఫెస్టోలో పెట్టింది. విశాఖలో సెక్రటేరియట్ ఏర్పాటు చేసి, విశాఖను పరిపాలనా రాజధానిగా చేసి, అమరావతిలో అసెంబ్లీని నిర్వహిస్తూ ఈ ప్రాంతాన్ని శాసన రాజధానిగా పెట్టి మూడు ప్రాంతాలనూ సమానంగా అభివృద్ధిచేయాలని భావించారు. 
రాయలసీమలో హైకోర్టు పెడితే ఏమొస్తుందని కొందరుద ప్రతిపక్షాల వాళ్లు అడుగుతున్నారు. 
వైయస్ జగన్ ఒక కులాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి రాజధానిని విశాఖకు తరలిస్తున్నారని ప్రచారం చేస్తున్నారు. 
ఆయనకు కుల భావనే ఉంటే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ను రాయలసీమలో పెట్టేవారు.
వైయస్ జగన్ ద్వేషిస్తున్నారని చెబుతున్న సామాజిక వర్గమే ఇప్పుడు కార్యనిర్వాహక రాజధానిగా చేస్తున్న విశాఖలో అత్యధికశాతం ఉన్నారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో ఆ సామాజిక వర్గం వాళ్లు ఉన్న ప్రాంతమే విశాఖ. 
మూడు ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేసే ఉద్దేశ్యంతోనే గ్రామ సచివాలయాలు, జిల్లాల పునర్వవ్యస్థీకరణ, రాజధానుల వికేంద్రీకరణ జరుగుతున్నాయి కానీ, వీళ్లు ఊహించినట్టు ఓ కులానికో, మతానికో, ప్రాంతానికో వ్యతిరేకంగా చేసే కార్యక్రమం కాదు.

అమరావతిలో అనేక కుంభకోణాలు 
అనేకరకాల అవకతవకలు
అమరావతి రాజధానిలోనే అన్నీ పెట్టాలి
నవ నగర నిర్మాణం చేస్తానని చంద్రబాబు చెప్పాడు
కనుక అన్ని హంగులూ తెచ్చి ఇక్కడే పెట్టి హైదరాబాద్, బెంగుళూరు, ముంబైలా అభివృద్ధి చేయాలని కోరుతున్నారు. 
ఇదంతా చేయడానికి 3-4 లక్షల కోట్లు ఖర్చు అవుతుంది.
కేంద్రం 2,500 కోట్లు రాజధానినిర్మాణానికి ఇస్తానంటే, లక్షల కోట్లు ఖర్చు చేసి ఈ ప్రాంతంలో రాజధాని నిర్మాణం చేసే అవకాశం ఉందా లేదా అనే విచక్షణ ఇక్కడున్న ప్రతిపక్షానికి లేదు. 

నిన్న సీఐడీ కేసులు పెట్టి కొందరిని అరెస్ట్ చేసింది. దళితులు, బీసీలకు చెందిన 1100 ఎకరాల అసైన్డ్ ల్యాండ్లకు సంబంధించిన కేసులవి. 
అసైన్డ్ ల్యాండ్లు కనుక రాజధానికోసం మీ భూములు తీసుకుంటే బదులుగా మీకు ఒక్క గజం కూడా స్థలం ఇవ్వము అని చెప్పి భయపెట్టారు. వాళ్లు భయపడి ఐదుపది లక్షలకు ఐనకాడికి భూములు తెగనమ్ముకున్నారు. తీరా ఆ భూములను కొన్నది చంద్రబాబు బినామీలే. వాళ్లకి 800గజాల ప్లాట్లు ఇస్తామని జీవో ఇచ్చాడు బాబు. 
ఎవరిపేరైతే అసైన్ చేసారో ఈ ప్లాట్లు వాళ్లకి ఇవ్వాలి. అమ్మే హక్కులేని వారి నుంచి కొనుక్కున్న పట్టాదారుకు అసైన్డ్ ల్యాండ్ కి బదులుగా పట్టా భూమి ఎలా ఇస్తారు? ఇది ఒక మోసం. 

గుడివాడ, జగ్గయ్య పేట, తెనాలి, గుంటూరులో కొంత ప్రాతాన్ని సీఆర్డీఏ పరిధిలోకి పెట్టాడు బాబు. ఈ పరిధిలోని పేదలకు అమరావతిలో పొలంమో, ఇల్లో ఇస్తామని ఈ ప్రభుత్వం అంటే, ధనికులు మాత్రమే ఇక్కడ ఉండాలంటూ కోర్టుకు వెళ్లి దాన్ని ఆపారు. పేదలకు ఇక్కడ ఉండే హక్కులేదంటూ కోర్టుకు వెళ్లి స్టే తెచ్చి పేదలను అమరావతిలో అడుగుపెట్టనివ్వలేదు చంద్రబాబు. 

గన్నవరం నియోజకవర్గంలో ఎయిర్పోర్టు ఉంది. దాన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుగా అభివృద్ధి చేయాలంటే రన్వే పెంచాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం 800 ఎకరాలు  భూమిని సేకరించి ఇమ్మని కేంద్రం అడిగింది. ఈ సేకరణలో ఎస్సీఎస్టీలకు ఇందిరా గాంధీ ప్రభుత్వం హయాంలో ఇచ్చిన భూములను, కొందరు రైతులు 70 ఏళ్లుగా వ్యవసాయం చేసుకునే భూములను అన్యాయంగా లాక్కుని వాళ్లకి సరైన న్యాయం చేయలేదు చంద్రబాబు. 
ఇక మిగిలిన భూమి కోసం కొందరు పెద్దలు సినీ ప్రముఖుల భూములను సేకరించారు. అశ్వినీదత్, రాఘవేంద్రరావు, కేవీరావ్, సీడ్స్ కంపెనీ శ్రీధర్ వంటి ప్రముఖుల భూములను సేకరించి వారికి మాత్రం అమరావతిలో లేక్ వ్యూ, కమర్షియల్ ప్లాట్లను ఎకరానికి 1450 గజాల చొప్పున వీళ్లందరికీ కోరుకున్న చోట, ఒకే చోట ప్లాట్లు కేటాయించాడు చంద్రబాబు. 
ఇక మిగిలిన, బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాల వారికి లాటరీలు తీసి ప్లాట్ లు ఇస్తామన్నారు కానీ ఇవ్వనేలేదు. 
అప్పట్లో గన్నవరంలో ఎకరం భూమి సేకరించాలంటే 50 లక్షల ఖర్చు అయ్యేది. అంటే 400 కోట్ల విలువైన ల్యాండ్ ప్రభుత్వం సేకరించి, అది ఇచ్చిన పెద్దలకు అమరావతిలో 3600 కోట్లు విలువచేసే భూములు ఇచ్చారు. కానీ వాళ్లతోపాటు పేదలకు మాత్రం ఇవ్వలేదు. ఇలాంటి ఎన్నో దుర్మార్గాలు చేసాడు చంద్రబాబు. 
ఇక మల్లవల్లిలో ఓ కారిడార్ పెట్టారు. ఇండస్ట్రీ పార్క్ ఇస్తానని చెప్పారు. అసైన్డ్ ల్యాండ్ వాళ్లకి కానీ, ప్రభుత్వ పొలాల్లో వ్యవసాయం చేసుకునే వారికి ఎవ్వరికీ రూపాయి ఇవ్వలేదు. గత ఇంటిలిజెన్స్ చీఫ్ బంధువు ద్వారా ఆయన చెప్పిన వాళ్లకు, ఆయన సామాజిక వర్గం వారికి మాత్రం కోట్లకు కోట్లు ల్యాండ్ ఆక్విజేషన్ ద్వారా ముట్టజెప్పారు. రోడ్ల నిర్మాణంలో చంద్రబాబుకు సంబంధించిన వ్యక్తుల స్థలాలను ముట్టుకోకుండా, పేద ప్రజల స్థలాలను మాత్రం సేకరణలో అడ్డగోలుగా తీసుకున్నారు. 
ఇలాంటి పనుల వల్లే కదా అమరావతిని కమ్మరావతి, భ్రమరావతి అని అంటున్నారు. 

72 అసెంబ్లీ నియోజకవర్గాలు కలిస్తే ఢిల్లీ మహానగరం
39 అసెంబ్లీ నియోజకవర్గాలు కలిస్తే ముంబై మహానగరం
24 అసెంబ్లీ నియోజకవర్గాలు కలిస్తే హైదరాబాద్
కలకత్తా, బెంగుళూరు, చెన్నై వంటి మహానగరాలు కూడా 30 అసెంబ్లీ నియోజకవర్గాలు కలిపితే సిటీగా మారాయి. 
వాటిని మించి అమరావతి చేస్తానంటాడు బాబు. 
ఇక అమరావతి అంటే తాడికొండ నియోజక వర్గంలో ఒక మండలంలో ఉన్న 29 గ్రామాలు..
ఒక నియ్జకవర్గంలో 5మండలాలుంటే ఆ ఐదు మండలాల్లో కూడా పూర్తిగా లేదు ఈ అమరావతి. 
ఆ మండలంలో ఉన్న 29 గ్రామాలు ఒక అమరావతి మహానగరం అయితే దాన్ని ఎప్పుడు, ఎలా ముంబై, చెన్నై, హైదరాబాద్ చేస్తాడు చంద్రబాబు?

చంద్రబాబు అమరావతి పెట్టి గ్రాఫిక్స్ రిలీజ్ చేసాడు . అమరావతిని గ్రాఫిక్స్ లో హైదరాబాద్ దాటి, ముంబై దాటి, ఢిల్లీదాటి, సింగపూర్, మలేషియాదాకా తీసుకెళ్లాడు...

Back to Top