కామెడీస్టార్‌ పులకేశ్‌.. నోరుఅదుపులో పెట్టుకో..

మాజీమంత్రి  కురసాల కన్నబాబు  

చంద్రబాబు కొడుకువే తప్ప నీ రాజకీయ అర్హతేంటి..?

2014–19 మధ్య నీ తండ్రి ఏం పీకాడో చెప్పు..?

ఒళ్లు తగ్గించుకున్నా బుద్ధిపెరగని అజ్ఞానివి నువ్వు లోకేశ్‌

సీఎం పేరెత్తి విమర్శించడానికి నువ్వెంత.. నీ బతుకెంత..?

నీకు పిల్లనిచ్చిన మామ కన్నా సర్టిఫైడ్ సైకో ఎవరున్నారు..?

వైయ‌స్‌ఆర్‌సీపీ నేతలపై అవినీతి ముద్ర వేయాలనే బిల్డప్పులు కట్టిపెట్టు

కాకినాడ అభివృద్ధిపై నాతో చర్చించే దమ్ముందా..?

సంస్కారిగా మాట్లాడకపోతే ప్రజల చేతుల్లో నీకు బడితెపూజ తప్పదు

హెచ్చరించిన మాజీమంత్రి కురసాల కన్నబాబు

కాకినాడ‌: కామెడీస్టార్‌ పులకేశ్‌.. నోరుఅదుపులో పెట్టుకో..అని మాజీమంత్రి  కురసాల కన్నబాబు హెచ్చ‌రించారు. కాకినాడ క్యాంప్‌ కార్యాలయంలో మాజీమంత్రి  కురసాల కన్నబాబు మీడియాతో మాట్లాడారు.

స్పందనలేని నారా పులకేశ్‌ యాత్రః
చంద్రబాబు కొడుకు నారా పులకేశ్‌ యాత్ర నిన్న కాకినాడలో జరిగింది. తింగరోడు తిరునాళ్లకు వెళ్లిన చందంగా అతనే జనాల్ని తెచ్చుకుని.. అతనే జెండాలు పట్టిచ్చి తనకు తానే శాపనార్ధాలు పెట్టుకుంటూ యాత్ర పూర్తయిందంటూ వచ్చిపోయాడు. ఆయన యాత్రలో కాకినాడ ప్రజలెవరూ లేరు. ఉన్న అరాకొరా జనం కూడా వేరే ఊళ్ల నుంచి అద్దెకు తెచ్చుకున్నట్లు ఉన్నాడు. స్పందనలేని యాత్రలు చేయడమెందుకో.. అభాసుపాలవడమెందుకో.. అతనికే బోధపడాలి. పాదయాత్ర ఎందుకు చేస్తున్నాడో.. దాని ద్వారా ఎవరికి ఏం చెబుతున్నాడో కూడా అతని మాటలు ఎవరికీ అర్ధంకాని పరిస్థితిగా ఉంది. 

పొలిటికల్‌ కామెడీస్టార్‌గా..
పాదయాత్ర చేయగానే పెద్ద నాయకుడిగా గుర్తింపు వస్తుందనే పిచ్చిభ్రమల్లో ఉన్నాడు ఈ నారా పులకేశ్‌. రాయలసీమ నుంచి యాత్ర అని మొదలుపెట్టి అక్కడక్కడా పడుతూలేస్తూ గోదావరి జిల్లాలకు చేరుకోగానే.. వాళ్ల నాన్న చంద్రబాబు అవినీతి కేసులో జైల్లోకి పోయాడు. నాన్నను లోపలేయగానే పులకేశ్‌ 89 రోజులు పాటు యాత్ర ఆపేశాడు. మళ్లీ ఇప్పుడు బయటకొచ్చి కామెడీస్టార్‌లా వచ్చీరాని తెలుగు పదాలతో మాట్లాడుతూ.. అందర్నీ నవ్వుకునేలా ప్రవర్తిస్తున్నాడు.

సంస్కారహీనుడు పులకేశ్ః
రాజకీయాల్లో ఉన్నంత మాత్రానా ఏ వ్యక్తీ మానవత్వం, సంస్కారాన్ని  వదులుకోవాల్సిన అవసరం లేదు. అలాంటిది, నారా పులకేశ్‌ మాత్రం తన తండ్రిని ఆదర్శంగా తీసుకుని సంస్కారహీనుడిలా తయారయ్యాడు. పెద్దాచిన్నా గౌరవం లేకుండా యాత్ర పేరిట ఊరూరా తిరిగి వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేల్ని, మంత్రుల్ని నోటికొచ్చినట్లు వాగుతున్నాడు. వీళ్ల నాన్న దొంగ కాబట్టి.. రాజకీయాల్లో ఉన్నవారంతా దొంగలేననే భావంతో అందరూ అవినీతిపరులనే ముద్ర వేయాలని చూస్తున్నాడు. ఈ పప్పు లోకేశ్‌ మా మీద అలాంటి ముద్రలు వేసినప్పటికీ నమ్మడానికి ప్రజలంతగా అమాయకులేమీ కాదు. ఈ పులకేశ్‌ రాజోలులో ఎస్సీ ఎమ్మెల్యేగా ఉన్న రాపాక వరప్రసాద్‌ గారిని నోటికెంత వస్తే అంతగా మాట్లాడాడు. ముమ్మిడివరంలో బీసీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌ గారిని, కాకినాడకొచ్చి నన్ను, పనిలోపనిగా ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి గారిని పిచ్చిపిచ్చిగా తిట్టుకుంటూ వెళ్లాడు. రోడ్లమీద పిచ్చోడికి ఈ పులకేశ్‌కూ ఎలాంటి తేడా కనిపించడంలేదు. ఎవడో రాసిన రాతల్ని స్క్రిప్టుల్లా పట్టుకుని పిచ్చిపిచ్చిగా చదువుకుంటూ తిట్టుకుంటూ పోతున్నాడంటే.. రాజకీయాల్లో ఇలాంటి సంస్కారహీనుడ్ని ఎక్కడా చూడలేమని చెప్పాలి. 

నాయకత్వ లక్షణాల్లేని పప్పుగాడుః  
నాయకుడంటే పదిమందికి ఆదర్శంగా ఉండి.. అండగా నిలిచి వారిని ముందుకునడిపించే వాడై ఉండాలి. కానీ, ఈ పులకేశ్‌కు అలాంటి నాయకత్వ లక్షణాలేమీ లేవు. ఎంతసేపూ.. తినడం, పడుకోవడం, గుర్తుకొచ్చినప్పుడు లేచి కొంతదూరం నడవడం, ఎవడో ఇచ్చిన స్క్రిప్టును చదవడమే పని. నిజానికి ఇతను నాయకుడైతే.. ఇతని నాయకత్వం మీద ప్రజలకు నమ్మకం ఉంటే మంగళగిరిలో గెలిపించేవారు కదా..? కేవలం, చంద్రబాబు కొడుకుగా మాత్రమే తప్ప ఈ పులకేశ్‌కు ప్రజల్లో తిరిగే అర్హతే లేదు. ఏ అర్హత లేని వ్యక్తిని చంద్రబాబు తీసుకొచ్చి టీడీపీ పార్టీ కేడర్‌పై రుద్దిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే.. అతను ఈ పులకేశ్‌ మాత్రమే. ఈ మధ్య బాడీ తగ్గించాడు తప్ప బుర్ర మాత్రం పెరిగినట్లు కనిపించడంలేదు. 

నీ బిల్డప్పులకు పప్పులుడకవ్‌..
నారా పులకేశ్‌ తనకు తాను పెద్ద మహానాయకుడిగా ఊహించుకుని ఇక్కడకొచ్చి మమ్మల్ని అవినీతిపరులని బ్రాండింగ్‌ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. 2014–19 మధ్య వాళ్ల నాన్న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హెరిటేజ్‌ మజ్జిగదగ్గర మొదలుకుని, అనకాపల్లి బెల్లం నుంచి, అమరావతి భూముల దాకా అడ్డగోలుగా దోచుకు తిని చివరికి ప్రధాని మోదీగారే చంద్రబాబు పోలవరంను ఏటీఎంగా మార్చేశాడని సర్టిఫికేట్‌ తెచ్చుకున్న వాడు ఇక్కడకొచ్చి మమ్మల్ని అవినీతిపరులని మాట్లాడుతున్నాడు. అంటే, దొంగే దొంగా దొంగా అని అరిచినట్టుగా లోకేశ్‌ వ్యవహారశైలిని అర్ధం చేసుకోవాలి. వైఎస్‌ఆర్‌సీపీ ప్రజాప్రతినిధుల క్యారెక్టర్‌లపై మరకలేసి జగన్‌మోహన్‌రెడ్డి గారి పక్షానున్న వారంతా అవినీతిపరులేనని చెప్పగానే.. టీడీపీ వారంతా మహానుభావులవుతారని వాళ్లకు వాళ్లే బిల్డప్‌ ఇచ్చుకునే ఎత్తుగడ ఇది. రాజకీయ అవగాహనలేని దద్దమ్మ లోకేశ్‌.. నీ బిల్డప్పులకు పప్పులుడికే రోజులు కావివి. 

2014–19 మధ్య ఏం పీకావ్‌ ..లోకేశ్‌..?
నువ్వు ఈరోజే కొత్తగా రాజకీయాల్లోకి రాలేదు. అదేదో.. ఇప్పుడే కొత్తగా వచ్చినట్టు ప్రస్తుత ప్రభుత్వం అవి కట్టలేదు.. ఇవి నిర్మించలేదని మాట్లాడుతున్నావే..? గతంలో మీ నాన్న అధికారంలో ఉన్నప్పుడు వాటిని ఎందుకు పట్టించుకోలేదో తెలుసుకునే బుద్ధుండాలి కదా..? మేం రోడ్లు వేయలేదంటే.. మరి, 2014–19 మధ్య టీడీపీ అధికారహయాంలో ఏం పీకారని ప్రశ్నిస్తున్నాను. మొట్టమొదటగా కాకినాడలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఆర్‌అండ్‌బీ రోడ్లు వేశాం. అలాంటిది, ఏమాత్రం అవగాహన లేకుండా ఏం మాట్లాడుతావో.. ఏంటో కూడా తెలియకుండా వాగుతున్నావు. నువ్వు మాట్లాడుతుంటే కనీసం నీ పక్కనున్నోళ్లు కూడా ఏమాత్రం హర్షించలేని పరిస్థితి ఉంది. నాలుగైదు వందల మంది జనంతో పెద్ద పెద్ద జెండాలు పట్టుకుని ఏదో చిన్న షో చేయగానే .. రాజకీయాల్లో సరిపోదు. ఒక కార్యక్రమం పెడుతున్నామంటే.. మనల్ని ప్రజలు ఎంతగా ఆదరిస్తున్నారో లేదోనని గమనించుకోవాలి. 

నువ్వెంత..నీ స్థాయెంత పులకేశ్‌.. ఫూల్‌..
రాజకీయాల్లో చంద్రబాబు కొడుకుగా నువ్వొక బచ్చాగాడివి పులకేశ్‌. అలాంటిది, నువ్వెంత.. నీ స్థాయి ఎంతని మా నాయకుడు జగన్‌ గారిని పట్టుకుని పెద్దపెద్ద మాటలంటావ్‌ ఫూల్‌.. అసలు, నీకు సంస్కారం, జ్ఞానం ఉందా..? ఒంటిచేత్తో 151 మంది ఎమ్మెల్యేల్ని, 22 మంది ఎంపీల్ని గెలిపించుకున్న వ్యక్తిని, సంక్షేమానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్న ముఖ్యమంత్రిని పట్టుకుని నోటికెంతొస్తే అంత మాట్లాడుతావా..? అసలు, ఆయన పేరెత్తే అర్హత నీకుందా..? ఆఫ్ట్రాల్‌ నువ్వొక పార్టీలో సామాన్య కార్యకర్తతో సమానం. ఎక్కడా జెడ్పీటీసీగానో.. ఎంపీటీసీ గానో.. సర్పంచి, చివరికి వార్డు మెంబర్‌గా కూడా గెలవలేనోడివి. నువ్వు వైఎస్‌ఆర్‌సీపీ గురించి, మా నాయకుడి గురించి మాట్లాడే స్థాయివ్యక్తివా..?  

ఎవర్రా సైకో.. నీ మామే కదా..?
నీ మామ బాలకృష్ణలాగా సినిమా డైలాగులు చెబితే ప్రజలు చప్పట్లు కొడతారనే పిచ్చిభ్రమల్లో ఉన్నావేమో..? ముఖ్యమంత్రిని పట్టుకుని సైకో అంటావా..? అరె ఫూల్‌.. ఎవర్రా సైకో.. ఈ రాష్ట్రంలో సైకో సర్టిఫికెట్‌ పొందిన ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే అది నీ మామే కదా..? సొంత నీకు పిల్లనిచ్చిన మామే పెద్ద సైకో అని సర్టిఫికెట్‌ పొంది నీదగ్గర ఉంటే.. నువ్వేమో ఎదుటోళ్లని మాట్లాడుతావా..? 

ఆడుదాం ఆంధ్రాపై అంత వెటకారమా..?
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి యూత్‌కు స్ఫూర్తిదాయకంగా ‘ఆడుదాం ఆంధ్రా’ పేరిట గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామస్థాయిలో క్రీడల పట్ల, ఆరోగ్యం పట్ల అందరికీ ఆసక్తిరేకెత్తేలా యువతను భాగస్వామ్యం చేయాలని ఈ కార్యక్రమం తలపెడితే ఈ పులకేశ్‌ దాన్ని కూడా వెటకారమాడుతున్నాడు. మా నాయకుడు నాలుగున్నరేళ్లు ఎవరితో ఆట ఆడారో తెల్సా.. నీతో నీ తండ్రితోనే.. మీరు గతంలో చేయలేని సంక్షేమాన్ని జగన్‌ గారు చేస్తుంటే, చేయలేని అభివృద్ధిని చేసి చూపిస్తుంటే అది మీకు మీతో ఆయన ఆడుతున్న ఆటలా కనిపిస్తుంది. ఎంతసేపూ ఒకడి మీద పడి ఏడ్వటం తప్ప ఇది మేము చేశామని చెప్పుకునే సత్తా మీకు లేదా..? అని లోకేశ్‌ను ప్రశ్నిస్తున్నాను. ఎర్రబుక్కు అని ఎవరిని బెదిరిస్తావు..? అంటే, నువ్వు కక్షసాధించడానికే అధికారంలోకి రావాలనుకుంటున్నావా..? మీ తప్పుల్ని మేం ఎత్తి చూపకూడదా..? ^è ంద్రబాబుకు నీకు నాలుగుకొమ్ములు న్నాయా..? మీకే ప్రత్యేక హక్కులున్నాయా..? 

నాతో చర్చించే దమ్ముందా..?ః
నేను వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రైతుభరోసా కేంద్రాల ఏర్పాటు దగ్గర్నుంచీ.. రైతులకు పెట్టుబడి సాయం వరకు శ్రీ జగన్‌మోహన్‌రెడ్డి గారి నాయకత్వంలో నా భాగస్వామ్యం ఉంది. కాకినాడలో పేదలకు ఇళ్లస్థలాలకు సెంటుభూమి పట్టాలకు సంబంధించి భూముల కొనుగోలు మొత్తం అత్యంత పారదర్శకంగా నడిపించాం. అలాంటిది, నామీద అవినీతి ముద్ర వేయాలని ప్రయత్నిస్తారా..? ఎంత దుర్మార్గులు మీరు. నాతో ఏ రంగం మీద చర్చిస్తావో .. చర్చించు. ఆ దమ్మూధైర్యం నీకుండా నా ముందుకు రా..లోకేశ్‌..? అని ఛాలెంజ్‌ చేస్తున్నాను. హైదరాబాద్‌లో కాపురాలు ఉండటం.. ఆంధ్రాకొచ్చి నీతికబుర్లు మాట్లాడటం.. మామీద బురదజల్లితే కడుక్కుంటారని అనుకోవడం చంద్రబాబు, లోకేశ్‌లకు పరిపాటిగా మారింది. ఇకనైనా, లోకేశ్‌ నీ నోరు అదుపులో పెట్టుకుని.. అజ్ఞానం పోయి జ్ఞానం రావాలని, మందబుద్ధి పోయి మంచి బుద్ధిరావాలని కోరుకో.. అప్పుడే నువ్వు నాయకుడిగా ఎదగగలుతావు. అంతేగానీ, నోటికొచ్చినట్టు మాట్లాడుకుంటూ రోడ్లమీద తిరుగుతానంటే మాత్రం ప్రజలు పరిగెత్తించి మరీ బుద్ధిచెబుతారని హెచ్చరిస్తున్నాను. 

తాజా వీడియోలు

Back to Top