జ‌గ‌న‌న్న కోసం ర‌క్తం దార‌పోసేందుకైనా సిద్ధం

వైయ‌స్‌ జగన్ నీడలో పెరిగిన వ్యక్తిని, ఆయన బాగుండాలని కోరుకుంటా

నాకు, మంత్రి కాకాణి మ‌ధ్య ఎలాంటి విభేదాలు లేవు

రీజ‌న‌ల్ కో-ఆర్డినేట‌ర్‌గా నియ‌మించిన సీఎంకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపేందుకు వ‌చ్చా

మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాద‌వ్‌

తాడేపల్లి: తామంతా ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ సైనికుల‌మ‌ని, ఆయ‌న ఏది చెబితే అది తూచా త‌ప్ప‌కుండా చేస్తామ‌ని మాజీ మంత్రి, వైయ‌స్ఆర్ సీపీ రీజ‌న‌ల్ కో-ఆర్డినేట‌ర్ డాక్ట‌ర్ అనిల్ కుమార్ యాద‌వ్ అన్నారు. ముఖ్య‌మంత్రితో భేటీ అనంత‌రం సీఎం క్యాంపు కార్యాల‌యం వ‌ద్ద మాజీ మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్ మీడియాతో మాట్లాడారు. త‌న‌పై న‌మ్మ‌కంతో రీజ‌న‌ల్ కో-ఆర్డినేట‌ర్‌గా నియ‌మించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్ కృత‌జ్ఞ‌త‌లు చెప్పేందుకు వ‌చ్చాన‌న్నారు. మంత్రి కాకాణి గోవ‌ర్థ‌న్‌రెడ్డికి త‌న‌కు మ‌ధ్య ఏ విధ‌మైన విభేదాలు లేవ‌ని స్ప‌ష్టం చేశారు. అంద‌రం క‌లిసిక‌ట్టుగా పార్టీ బ‌లోపేతం కోసం, ప్ర‌జ‌ల కోసం ప‌నిచేస్తామ‌ని, వైయ‌స్ఆర్ సీపీలో వ‌ర్గాలు అంటూ ఏమీ ఉండ‌వ‌ని, అంతా వైయ‌స్ జ‌గ‌న్ వ‌ర్గ‌మ‌ని, జ‌గ‌న‌న్న‌ సైనికుల‌మ‌ని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్ పున‌రుద్ఘాటించారు. 

సీఎం వైయ‌స్‌ జగన్ నీడలో పెరిగిన వ్యక్తిని, ఆయన బాగుండాలని కోరుకుంటానని అనిల్‌కుమార్ యాద‌వ్ అన్నారు. సీఎం వైయ‌స్‌ జగన్‌ కోసం రక్తం దారపోసేందుకు కూడా సిద్ధమ‌ని స్ప‌ష్టం చేశారు. బీసీలకు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ఇచ్చిన ప్రాధాన్యాన్ని ప్రజల్లోకి, అట్టడుగు స్థాయికి తీసుకెళ్తామ‌న్నారు. ఇప్పుడు మంత్రి ప‌ద‌వులు కోల్పోయిన 14 మంది స‌భ్యులు.. తిరిగి మళ్లీ మంత్రులం అవుతామ‌ని చెప్పారు. 90 శాతం మంది ఎమ్మెల్యేల్లో అందరం సీఎం వైయ‌స్‌ జగన్ ఫొటో పెట్టుకుని గెలవాల్సిందేన‌ని, ముఖ్యమంత్రికి తామంతా బలం అవ్వాలి కానీ బలహీనత కాకూడదన్నారు. తాను మంత్రిగా ఉన్న‌ప్పుడు ఏ పార్టీదైనా ఫ్లెక్సీలు తీసేసారు అంటే అది మున్సిపాలిటీ వాళ్ళు తీసేసింది త‌ప్ప‌.. తాను చేసిందేమీ లేద‌ని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్ తెలిపారు. 

Back to Top