కాకినాడ: నారా హమారా.. అమరావతి హమారా.. ఇదే పాదయాత్ర నినాదం.. టీడీపీ గెజిట్ ఈనాడులో స్పష్టమైందని మాజీ మంత్రి, వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పేర్కొన్నారు. రాష్ట్రం అంతా మనదే అనే భావన మా ప్రభుత్వానిది అయితే.. అమరావతి మాత్రమే అనే భావన మీది అని మండిపడ్డారు. అందుకే నారా హమారా.. అమరావతి హమారా అనే నినాదం ఇచ్చారు.. ఈ విషయం టీడీపీ గెజిట్ ఈనాడు రాతల్లోనే స్పష్టమైందంటూ ఈనాడు పత్రికలో వచ్చిన కథనాలను మీడియాకు చూపించారు. కాకినాడలో మాజీ మంత్రి కన్నబాబు మంగళవారం మీడియాతో మాట్లాడారు.
కన్నబాబు ఏమన్నారంటే..
- విశాఖలో పరిపాలన రాజధాని వద్దనే హక్కు మీకు ఎవరిచ్చారు..
- అమరావతికి భూములిచ్చిన వారందరూ త్యాగమూర్తులైతే.. పోలవరం ప్రాజెక్టు భూములిచ్చి, కట్టుబట్టలతో పుట్టిన గ్రామాలను వదిలి మౌనంగా వెళ్లిపోయిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, రైతులను ఏమంటారు.. త్యాగమూర్తులు, త్యాగాధనులు కాదా?
- అమరావతి మీద ప్రెస్ మీట్ పెడితే ఎవరు రియాక్ట్ అవుతారో ముందే తెలుసు.. బుచ్చయ్య చౌదరి రియాక్ట్ అవుతారు.. అమరావతి కోసం రేణుకా చౌదరి తెలంగాణ నుంచి వస్తారు..
- అమరావతి రాజధాని అనేది.. కేవలం కొంతమందికి సంబంధించింది మాత్రమే.. ఒక పార్టీ సిద్ధాంతానికి అనుగుణంగా, ఒక రాజకీయ పార్టీ అవసరాల కోసం, ఒక రాజకీయ పార్టీ కోసమేనని రాష్ట్ర ప్రజలందరూ భావిస్తున్నారు.. ఇదే విషయం నేను చెబితే బుచ్చయ్య ప్రెస్ మీట్ పెట్టి వ్యక్తిగతంగా దూషిస్తున్నారు.. అమరావతిలో ఏం జరిగిందో మీకు తెలియదా?
అమరావతిపై అసెంబ్లీలో చర్చిద్ధాం.. రండి.!
- మీ నాయకుడు బయట.. ఎమ్మెల్యేలు అసెంబ్లీ లోపల.. ఇవేం ద్వంద ప్రమాణాలు.. ఈ రెండు ధోరణలు. రెండు నాల్కులు. ఈ యూటర్న్ లు ఏంటి?
- నారా హమారా.. అమరావతి హమారా.. మీద చర్చిద్దాం రండి..
- అమరావతికి అన్యాయం చేసింది ఎవరు?, ద్రోహం చేసింది ఎవరో.. చర్చిద్దాం రండి..
- రాష్ట్ర ప్రజలు అన్ని ప్రాంతాల అభివృద్దిని, మూడు రాజధానులను కోరుకుంటున్నారు..
- మీకు వత్తాసు పలికే పత్రికలు, టీవీ ఛానల్స్ ఉన్నాయని, వాటి ద్వారా మీకున్న బలంతో తిమ్మిని బమ్మిని చేద్దామనుకుంటే ప్రజలు అంత అమాయకులు కాదు..
- టీడీపీకి మద్దతిచ్చే వాళ్లు మాత్రమే వారి కులంలో గౌరవప్రదమైన వారి కింద లెక్క.. మరి మాజీ మంత్రి కొడాలి నానిపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు..
- విశాఖను పరిపాలనా రాజధానిగా.. వద్దు అనే హక్కు మీకు ఎవరు ఇచ్చారు..? కర్నూలులో న్యాయ రాజధాని వద్దు అనే హక్కు మీకెక్కడి.. ?
ప్రాంతాల మధ్య విద్వేషాలు, వైషమ్యాలు రెచ్చగొడితే చూస్తూ ఊరుకోం..
- అమరావతిలో శాసనరాజధాని ఉంటుంది.. దానిని ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు వ్యతిరేకించట్లేదు.
- ప్రాంతాల మధ్య విద్వేషాలు రగిలేలా.. వైషమ్యాలు వచ్చేలా.. టీడీపీ నాయకత్వం ప్రవర్తిస్తే వైయస్ఆర్ సీపీ చూస్తూ ఊరుకోదు..
- అమరావతి నుంచి అరసవల్లి యాత్రలో మీ అసలు ఉద్దేశం ఏంటి? ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ముడిపెట్టడానికే కదా మీ కుట్ర..?
- ముఖ్యమంత్రి జగన్ గారి మీద బురదచల్లాలనేగా మీ కుట్ర..?