వైయ‌స్ జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌తో కూట‌మి స‌ర్కార్‌లో వ‌ణుకు

మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ  

రాజ‌మ‌హేంద్ర‌వ‌రం:  వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గుంటూరు పర్యటనతో టీడీపీ కూట‌మి స‌ర్కార్‌లో వ‌ణుకు మొద‌లైంద‌ని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల‌కృష్ణ పేర్కొన్నారు.  గుంటూరు మిర్చి యార్డులో పర్యటించి రైతుల గోడు విన్నందుకుగానూ వైయ‌స్ జ‌గ‌న్‌పై కేసు పెట్ట‌డం, ఎలాంటి సభ, మైక్ ప్రచారం నిర్వహించకపోయినా పోలీసులు కేసు నమోదు చేయడం గమనార్హమ‌న్నారు. గురువారం రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో వేణుగోపాల‌కృష్ణ మీడియాతో మాట్లాడారు. `కేవలం వైయ‌స్ జగన్ గుంటూరు మిర్చి యార్డు పర్యటన వల్లే చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. వైయస్ జగన్ చేసిన పర్యటన వల్ల ప్రభుత్వానికి వణుకు పుట్టింది.  ప్రభుత్వ బాధ్యతలను విస్మరించి చంద్ర‌బాబు పాలన సాగిస్తున్నారు. ప్రభుత్వం విఫలమైందనటానికి ఇదో ఉదాహరణ. అధికారపక్షం ఎక్కడ సమస్యలు పరిష్కరించకపోయినా, ప్రతిపక్షం మేలుకొలుపుతూనే ఉంటుంది. స్వల్పకాలంలోనే ప్రజలు ప్రభుత్వ తీరును అర్థం చేసుకున్నారు. ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను రాష్ట్ర ప్రజలు  క్షమించరు` అంటూ చెల్లుబోయిన వేణుగోపాల‌కృష్ణ హెచ్చ‌రించారు.

 

Back to Top