ప్ర‌జ‌ల క‌ష్టాల‌పై కొత్త ఏడాది పోరాటం  

మాజీ డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా

వైయ‌స్ఆర్ జిల్లా:  రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను కూట‌మి స‌ర్కార్ న‌ట్టేట ముంచింద‌ని వైయ‌స్ఆర్‌సీపీ మైనారిటీ నేత‌, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా మండిపడ్డారు. ప్ర‌జ‌ల క‌ష్టాల‌పై కొత్త ఏడాది పోరాటం చేస్తామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. బుధ‌వారం క‌డ‌ప న‌గ‌రంలోని త‌న క్యాంపు కార్యాల‌యంలో నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌ల్లో అంజాద్‌బాషా పాల్గొని కేక్ క‌ట్ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నిక‌ల్లో గెలుపుకోసం చంద్ర‌బాబు లెక్క‌లేన‌న్ని హామీలు ఇచ్చార‌ని, అధికారంలోకి వ‌చ్చాక ఆ హామీల‌న్నీ గాలికొదిలేశార‌ని ధ్వ‌జ‌మెత్తారు. పూర్తి స్థాయి బ‌డ్జెట్ కూడా ప్ర‌వేశ‌పెట్ట‌లేని ప‌రిస్థితిలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఉంద‌ని దుయ్య‌బ‌ట్టారు.

Back to Top