మాచర్ల టీడీపీ మాజీ ఇన్‌ఛార్జ్‌ కొమ్మారెడ్డి చలమారెడ్డి వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌

తాడేప‌ల్లి: ప‌ల్నాడు జిల్లాలో తెలుగు దేశం పార్టీ భారీ షాక్ త‌గిలింది.  పల్నాడు జిల్లా టీడీపీ సీనియర్‌ నేత, మాచర్ల టీడీపీ మాజీ ఇన్‌ఛార్జ్‌ కొమ్మారెడ్డి చలమారెడ్డి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సోమ‌వారం తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి  వైయ‌స్‌ జగన్‌ సమక్షంలో టీడీపీ సీనియర్‌ నేత, మాచర్ల టీడీపీ మాజీ ఇన్‌ఛార్జ్‌ కొమ్మారెడ్డి చలమారెడ్డి వైయ‌స్ఆర్ పార్టీలో చేరారు.
చలమారెడ్డితో పాటు  టీడీపీ స్ధానిక నాయకులు కె.శ్రీనివాసరెడ్డి, కె.రామచంద్రారెడ్డి, కె.వెంకటేశ్వరరెడ్డి, కె.షణ్ముక్‌ రెడ్డి, వి.శంకర్ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మ‌క్షంలో వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు.
 
కార్యక్రమంలో ప్రభుత్వ విప్, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు.

తాజా వీడియోలు

Back to Top