‘ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌కు రుణపడి ఉంటాం’

 

విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌కు ఎల్లవేళలా రుణపడి ఉంటామని మత్స్యకారులు అన్నారు. విశాఖపట్నం జిల్లా భీమిలిలో సీఎం వైయస్‌ జగన్‌ చిత్రపటానికి మత్స్యకారులు క్షీరాభిషేకం చేశారు. అంతకుముందు భీమిలిలో భారీ ర్యాలీ నిర్వహించి దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మత్స్యకారులు మాట్లాడుతూ.. వేట నిషేధ సమయంలో ఇంతకు ముందు తమకు రూ.4 వేల పరిహారం వచ్చేదని, సీఎం వైయస్‌ జగన్‌ పరిహారాన్ని రూ. 10 వేలకు పెంచి ఆదుకున్నారన్నారు. పరిహారంతో పాటు డీజిల్‌పై సబ్సిడీ పెంచినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.

Read Also: ఘనంగా ఎంపీ గొడ్డేటి మాధవి వివాహం

Back to Top