పథకాల అమలులో వలంటీర్లు కీలకం

వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి

ఉరవకొండ: ప్రభుత్వ పథకాలను అర్హులైన లబ్ధిదార్లుకు పారదర్శకంగా అందించడంలో గ్రామ, వార్డు వాలంటీర్లు కీలకమని అదే సమయంలో వారు అందిస్తున్న సేవలు ఎనలేనివని వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి అన్నారు. మంగళవారం విడపనకల్లులో వలంటీర్లకు సేవా పురస్కారాల అందజేసే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్వేశ్వరరెడ్డి,జెడ్పిటిసి హనుమంతూ, నాయకులు బసన్న, భరత్ రెడ్డి, భీమరెడ్డి, మాజీ జెడ్పిటిసి తిప్పయ్య, ఎంపిడిఓ శ్రీనివాసులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ కుల, మత, రాజకీయాలకు అతీతంగా అర్హతే ప్రాతిపదికన సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించడంలో వాలంటీర్లు అందిస్తున్న సేవలు నిరుపమానమని కొనియాడారు..కోవిడ్ సమయంలో వలంటీర్లు అందించిన సేవలు ఎనలేనివన్నారు.మీ సేవలకు తగిన గుర్తింపు ఇవ్వాలనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నగదు పురస్కారంతో అవార్డులు అందిస్తోందని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏర్పాటైన సచివాలయ, వలంటీర్ల వ్యవస్థలు రాష్ట్ర ప్రతిష్టను మరింత పెంచాయని చెప్పారు..అనంతరం వలంటీర్లకు సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర పురస్కారాలను ఆయన ప్రదానం చేశారు.అనంతరం వలంటీర్లు,నాయకులతో మాజీ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్లు, ఎంపిటిసిలు, వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Back to Top