వేలాదిగా తరలి వెళ్లేందుకు 'సిద్ధం' కండి

11 న రాప్తాడులో జరిగే సీఎం సభను విజయవంతం చేయండి
 
ఉర‌వ‌కొండ నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి పిలుపు 

ఉరవకొండ: రాప్తాడు వద్ద ఈనెల 11 వ తేదీ నిర్వహించే 'సిద్ధం' ఎన్నికల సమర శంఖారావం సభను విజయవంతానికి వైయ‌స్ఆర్‌ సీపీ శ్రేణులంతా కదలిరావాలని ఉరవకొండ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి పిలుపునిచ్చారు. రాప్తాడులో ముఖ్యమంత్రి  సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆధ్వర్యంలో సిద్ధం సభ నిర్వహిస్తున్న నేపథ్యంలో మంగళవారం ఉరవకొండ బైపాస్ దేవాంగ కల్యాణ మండపంలో నియోజకవర్గ వైయ‌స్ఆర్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధుల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. రాప్తాడులో సీఎం వైయ‌స్ జగన్ మోహ‌న్ రెడ్డి హాజరయ్యే సభకు ప్రతి గ్రామం నుంచీ ప్రజలు వేలాదిగా తరలివచ్చి చరిత్ర సృష్టించాలన్నారు. గత నెల 23 న ఉరవకొండ లో సీఎం వైయ‌స్ జగన్ పాల్గొన్న వైయ‌స్ఆర్‌ ఆసరా సభను విజయవంతం చేసినందుకు వైయ‌స్ఆర్‌ సీపీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆ సభకు మించి 'సిద్ధం' సభకు మన నియోజకవర్గం నుంచి హాజరు కావాలన్నారు. సీఎం వైయ‌స్ జగన్ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్నారని, ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడంతో పాటు అభివృద్ధికి పెద్దపేట వేశారని వివరించారు. విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని తెలిపారు. ప్రతి పథకంలోను మానవత్వం ఉందని, ప్రతి గుండె జగనన్న సభకు రావాలని ఎదురు చేస్తోందని వివరించారు. ప్రతి పథకాన్ని ఇంటింటికీ చేర్చారని, ఓటు ఆడిగే దమ్ము, ధైర్యం జగనన్న సైన్యానికే దక్కుతుందని చెప్పాడు. జగనన్నను రెండోసారి సీఎం అయ్యే వరకూ సైనికుల్లా పని చేయాలని పిలుపునిచ్చారు. టీడీపీ హయాంలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని విమర్శించారు. సమావేశంలో ఐదు మండలాల ప్రజాప్రతినిధులు, వైయ‌స్ఆర్‌ సీపీ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Back to Top