వైయస్‌ఆర్‌ సీపీలోకి మాజీ ఎమ్మెల్యే బిజ్జం

నంద్యాల: మాజీ ఎమ్మెల్యే బిజ్జం పార్థసారధి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. నంద్యాల ప్రచార సభలో వైయస్‌ జగన్‌ పాల్గొన్నారు. సభ ముగిసిన అనంతరం పాణ్యం మాజీ ఎమ్మెల్యే బిజ్జం పార్థసారధి, వెలుగోడు జెడ్పీటీసీ సభ్యుడు లాల్‌స్వామి, డాక్టర్‌ రవికృష్ణ, డాక్టర్‌ హరినాథరెడ్డిలకు వైయస్‌ జగన్‌ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 

Back to Top