సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌తో ఇథియోపియా బృందం భేటీ

తాడేప‌ల్లి: ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డితో ఇథియోపియా బృందం భేటీ అయ్యింది. రాష్ట్ర ప‌ర్య‌ట‌న నిమిత్తం తాడేప‌ల్లి చేరుకున్న ఇథియోపియా బృందం స‌భ్యులు సీఎం క్యాంపు కార్యాల‌యంలో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ప‌లు అంశాల‌పై సీఎంతో చ‌ర్చించారు. ఇథియోపియా బృందం స‌భ్యుల‌ను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స‌న్మానించారు. సీఎంను క‌లిసిన వారిలో ఇథియోపియా వ్యవసాయ శాఖ మంత్రి డాక్ట‌ర్‌ మెలెస్ మెకోనెన్ యిమర్ సహా పలువురు సభ్యులు ఉన్నారు. 

Back to Top