మోగిన ఎన్నిక‌ల న‌గారా

  • ఎన్నికల నోటిఫికేషన్ విడుదల 18 మార్చి ( నామినేషన్ల స్వీకరణ ప్రారంభం)
  • నామినేషన్ల దాఖలుకు తుది గడువు 25 మార్చి
  •  నామినేషన్ల స్క్రూటినీ - 26 మార్చి
  • నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ 28 మార్చి
  • పోలింగ్ తేదీ 11 ఏప్రిల్ 

ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల..

ఆంధ్రప్రదేశ్ లో సాధారణ ఎన్నికలతో పాటు రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలకు నగరా మోగింది. ఈనెల 18 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై, ఏప్రిల్ 11 వ తేదీన పోలింగ్ జరగనుంది. అన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తి అయిన తరువాత దేశ వ్యాప్తంగా మే 23 వ తేదీన కౌటింగ్ ప్రక్రియను చేపట్టనున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది.  రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకే దశలో, ఒకే తేదీల్లో ఎన్నికల ప్రక్రియ జరగనుంది. ఎన్నికల షెడ్యూల్ వెలువడినందున ఎన్నికల ప్రవర్తనా నియమావళి తక్షణం అమలులోకి వచ్చింది. ఆదివారం సాయంత్రం ఢిల్లీలో ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా నేతృత్వంలోని ఎన్నికల సంఘం నిర్వహించిన మీడియా  సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. 

ఎన్నికల నోటిఫికేషన్ విడుదల 18 మార్చి ( నామినేషన్ల స్వీకరణ ప్రారంభం)
నామినేషన్ల దాఖలుకు తుది గడువు 25 మార్చి
నామినేషన్ల స్క్రూటినీ - 26 మార్చి
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ 28 మార్చి
పోలింగ్ తేదీ 11 ఏప్రిల్ 

Back to Top